Share News

రెయిన్ అలర్ట్.. మూడు రోజుల పాటు వర్షాలు..

ABN , Publish Date - Aug 06 , 2026 | 06:34 PM

ఆంధ్రప్రదేశ్‌ వ్యాప్తంగా మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని తుపాను హెచ్చరికల కేంద్రం డైరెక్టర్ మూర్తి తెలిపారు. ఉపరితల ఆవర్తనం కారణంగా గురువారం నుంచి వరుసగా మూడు రోజుల పాటు వానలు కురవనున్నట్లు ఆయన వెల్లడించారు.

రెయిన్ అలర్ట్.. మూడు రోజుల పాటు వర్షాలు..
AP Rain Alert

విశాఖ: ఆంధ్రప్రదేశ్‌ వ్యాప్తంగా మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని తుపాను హెచ్చరికల కేంద్రం డైరెక్టర్ మూర్తి తెలిపారు. ఉపరితల ఆవర్తనం కారణంగా ఈరోజు (గురువారం) నుంచి వరుసగా మూడు రోజుల పాటు వానలు కురవనున్నట్లు ఆయన వెల్లడించారు. వాయువ్య బంగాళాఖాతం, ఉత్తర ఒడిశాపై ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని, ఇది సముద్ర మట్టానికి 900 మీటర్ల ఎత్తులో కొనసాగుతోందని మూర్తి పేర్కొన్నారు.


ఉపరితల ఆవర్తన ప్రభావంతో ఏపీలోని పలు ప్రాంతాల్లో ఈరోజు, రేపు, ఎల్లుండి వర్షాలు పడే అవకాశం ఉందని మూర్తి వెల్లడించారు. ఉత్తర, దక్షిణ కోస్తా ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వానలు కురవనున్నట్లు తెలిపారు. కొన్ని ప్రాంతాల్లో ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. ఉరుములతో కూడిన జల్లులు పడే సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. ముఖ్యంగా రైతులు, వ్యవసాయ కూలీలు, పశువుల కాపరులు అప్రమత్తంగా ఉండాలని తుపాను హెచ్చరికల కేంద్రం డైరెక్టర్ మూర్తి సూచించారు.


ఈ వార్తలు కూడా చదవండి

పరామర్శల పేరుతో జగన్ విధ్వంసం, అరాచకం సృష్టిస్తున్నారు: హోం మంత్రి అనిత

అమరావతిలో 47 అంతస్తుల ట్విన్ టవర్స్‌కు ఏపీ కేబినెట్ ఆమోదం

Updated Date - Aug 06 , 2026 | 06:50 PM