అమరావతిలో 47 అంతస్తుల ట్విన్ టవర్స్‌కు ఏపీ కేబినెట్ ఆమోదం
ABN , Publish Date - Aug 06 , 2026 | 04:43 PM
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశం జరిగింది. ఏదుల ముస్తూరులో 19.55 ఎకరాలు APIICకి బదిలీకి కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు మంత్రి పార్థసారథి తెలిపారు.
అమరావతి, ఆగస్టు 6: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను మంత్రి పార్థసారథి మీడియాకు వివరించారు. ఏదుల ముస్తూరులో 19.55 ఎకరాలు APIICకి బదిలీకి కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలిపారు. తిమ్మసముద్రంలో 13.45 ఎకరాలు CUDAకు బదిలీ చేసేందుకు ఆమోదం తెలిపినట్లు చెప్పారు. కొత్త జిల్లాలకు అనుగుణంగా UDAల పునర్వ్యవస్థీకరణకు మంత్రివర్గం అంగీకారం తెలిపిందని, UDAల సంఖ్య 21 నుంచి 23కు పెంచుతూ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. కండలేరు నుంచి పరిశ్రమల క్లస్టర్‌కు నీటి సరఫరాకు కేబినెట్ ఆమోద ముద్ర వేసిందన్నారు.
విజయవాడ ఆటోనగర్ కాలనీవాసులకు UDS హక్కులను క్రమబద్ధీకరిస్తూ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి తెలిపారు. 400 హౌసింగ్ యూనిట్ల భూ సమస్యకు కేబినెట్‌లో పరిష్కారం చూపామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా పెండింగ్ భూ వివాదాల పరిష్కారానికి సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేసినట్లు చెప్పారు. అమరావతి ‘ఐ’ ప్రాజెక్టుకు సవరించిన టెండర్లకు ఆమోదం తెలిపినట్లు వెల్లడించారు. ఎత్తైన అమరావతి ఐ నిర్మాణానికి ప్రత్యేక ప్రోత్సాహకాలు అందించేందుకు కేబినెట్ అంగీకారం తెలిపిందన్నారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌కు 'ఆమ్నిబస్ చట్టం-2026' చట్టాన్ని తీసుకొచ్చామని, పెట్టుబడులకు అడ్డంకుల తొలగింపే ఆమ్నిబస్ చట్టం లక్ష్యమని పార్థసారథి స్పష్టం చేశారు. కుప్పం గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్ట్ భూసేకరణకు ప్రత్యేక పరిహారం అందజేయనున్నట్లు తెలిపారు.
డి-ఫామ్ లేని సాగుదారులకు ఎకరాకు రూ.12.44 లక్షల పరిహారం అందించేందుకు కేబినెట్ అంగీకారం తెలిపిందన్నారు. అమరావతిలో 47 అంతస్తుల ట్విన్ టవర్స్ నిర్మాణానికి ఆమోదం లభించిందని, ట్విన్ టవర్స్‌లో కార్పొరేట్, క్వాంటమ్ సంస్థలకు అవకాశం ఇచ్చేందుకు నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. హైకోర్టు భవనం రీ-డిజైన్ ప్రతిపాదనకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందన్నారు. ఏపీ PPP పాలసీ-2026కు మంత్రిమండలి నుంచి ఆమోదం ముద్ర పడినట్లు చెప్పారు. PPP ప్రాజెక్టులకు రూ.1,500 కోట్ల వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ ఏర్పాటు చేయాలని మంత్రివర్గం సమావేశంలో నిర్ణయించినట్లు వెల్లడించారు. భారీ పెట్టుబడుల ఆకర్షణే కొత్త PPP పాలసీ లక్ష్యమని తెలిపారు. మోతడకలో 2,344 ఎకరాల్లో ల్యాండ్ పూలింగ్‌కు ఆమోద ముద్ర పడిందన్నారు. హైస్పీడ్ రైలు, ఇన్నర్ రింగ్ రోడ్డుకు భూముల సమీకరణకు మంత్రివర్గం అంగీకారం తెలిపిందని మంత్రి పార్థసారథి పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి...
స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నద్ధం కావాలి.. మంత్రులకు లోకేశ్ పిలుపు
గుంటూరులో వైసీపీ నేత అంబటి రాంబాబుపై కేసు నమోదు
Read Latest AP News And Telugu News