Share News

ప్రియాంక ఘటనపై అధికారులతో హోం మంత్రి అనిత సమీక్ష.. కఠిన చర్యలకు ఆదేశం

ABN , Publish Date - Aug 09 , 2026 | 01:20 PM

విశాఖపట్నంలో వైద్య విద్యార్థిని ప్రియాంకను కారుతో ఢీకొట్టిన ఘటనపై ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. ఈ ఘటనపై మంత్రి నారా లోకేశ్, హోం మంత్రి అనిత.. అధికారులతో నిరంతరం సమీక్షిస్తున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే పోలీసులు స్పందించి, నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు హోం మంత్రి అనిత తెలిపారు.

ప్రియాంక ఘటనపై అధికారులతో హోం మంత్రి అనిత  సమీక్ష.. కఠిన చర్యలకు ఆదేశం
Priyanka Incident Visakhapatnam

విశాఖపట్నం, ఆగస్టు 9: వైద్య విద్యార్థిని ప్రియాంకను కారుతో ఢీకొట్టిన ఘటనపై జిల్లా ఎస్పీతో ఎప్పటికప్పుడు ఫోన్‌లో మాట్లాడుతున్న హోం మంత్రి అనిత.. కేసు దర్యాప్తు, తదుపరి చర్యలపై ఆరా తీస్తున్నారు. అలాగే ప్రియాంక తండ్రి వెంకటేష్‌తో ఫోన్‌లో మాట్లాడి ధైర్యం చెప్పారు. ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని ఆయనకు భరోసా ఇచ్చారు. ప్రియాంక కుటుంబానికి న్యాయం జరిగేలా పోలీసులు చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటున్నారని హోం మంత్రి స్పష్టం చేశారు.


ప్రమాదం జరిగిన వెంటనే పోలీసులు స్పందించారని, కేసులో ఇప్పటికే నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించామని అనిత వెల్లడించారు. ఘటనపై దర్యాప్తును వేగవంతం చేసి, చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం పూర్తి అండగా ఉంటుందని మరోసారి భరోసా ఇచ్చారు.


ఈ వార్తలు కూడా చదవండి..

జమ్మూ కశ్మీర్‌లోని సోపోర్‌లో భద్రతా దళాలు ఆకస్మిక తనిఖీలు

ప్రధాని మోదీని సంప్రదించిన తర్వాతే.. రాజీనామా చేశా: ధర్మేంద్ర ప్రధాన్

For More TG News And Telugu News

Updated Date - Aug 09 , 2026 | 01:27 PM