Share News

నవంబర్ నాటికి విశాఖ వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ అందుబాటులోకి: మంత్రి నారాయణ

ABN , Publish Date - Sep 19 , 2026 | 09:46 PM

విశాఖపట్నం మధురవాడ పరిధిలోని మారికవలస డంపింగ్ యార్డ్‌ను మంత్రి నారాయణ సందర్శించారు. అక్కడ నూతనంగా ఏర్పాటు చేసిన సీ అండ్ డీ వేస్ట్ ప్రాసెసింగ్ ప్లాంట్‌ను ఆయన పరిశీలించారు.

నవంబర్ నాటికి విశాఖ వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ అందుబాటులోకి: మంత్రి నారాయణ
Visakhapatnam Waste Management: Minister Narayana Inspects C&D Waste Plant

విశాఖపట్నం, సెప్టెంబర్ 19: విశాఖపట్నం మధురవాడ పరిధిలోని మారికవలస డంపింగ్ యార్డ్‌ను రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ సందర్శించారు. అక్కడ నూతనంగా ఏర్పాటు చేసిన సీ అండ్ డీ (C&D) వేస్ట్ ప్రాసెసింగ్ ప్లాంట్‌ను ఆయన స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్‌పై ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ఆయన వివరించారు.

రాష్ట్రంలో చెత్త సేకరణ, సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్‌కు ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని, ఇళ్లు, కార్యాలయాలు, హోటళ్లు, పాఠశాలల నుంచి ప్రతిరోజూ సేకరించే చెత్తను విద్యుత్‌గా మార్చేందుకు కొత్త ప్లాంట్లను ఏర్పాటు చేస్తున్నామని మంత్రి చెప్పారు. విశాఖపట్నంలోని వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ సామర్థ్యాన్ని 1,200 టన్నుల నుంచి 1,600 టన్నులకు పెంచుతున్నామని, ఈ ప్లాంట్‌ను నవంబర్ నాటికి అందుబాటులోకి తీసుకురానున్నామని మంత్రి నారాయణ అన్నారు. రాబోయే రెండేళ్లలో రాష్ట్రవ్యాప్తంగా మరిన్ని ప్లాంట్లను ఏర్పాటు చేస్తామని ఈ సందర్భంగా మంత్రి వెల్లడించారు.

లెగసీ వేస్ట్ క్లియరెన్స్: గతంలో భారీగా పేరుకుపోయిన లెగసీ వేస్ట్‌లో ఇప్పటికే చాలా వరకు తొలగించామని, మిగిలిన వ్యర్థాలను కూడా త్వరలోనే పూర్తిగా క్లియర్ చేస్తామని మంత్రి చెప్పారు. నిర్మాణ రంగానికి చెందిన సీ అండ్ డీ (C&D) వ్యర్థాలను రీసైకిల్ చేసి తిరిగి వినియోగించేలా చర్యలు తీసుకుంటున్నామని. ముఖ్యంగా విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి నగరాల్లోని సీ అండ్ డీ ప్లాంట్లపై ప్రత్యేక దృష్టి సారించామని మంత్రి వివరించారు.

30 టన్నుల బయోగ్యాస్ ప్లాంట్: కూరగాయల వ్యర్థాల నుంచి బయోగ్యాస్ ఉత్పత్తి చేసేందుకు విశాఖలో రోజుకు 30 టన్నుల సామర్థ్యంతో బయోగ్యాస్ ప్లాంట్‌ను అందుబాటులోకి తెస్తున్నామని,

చెత్తను కేవలం పారవేసే పదార్థంగా కాకుండా విద్యుత్, బయోగ్యాస్, రీసైక్లింగ్ ద్వారా ఉపయోగకర సంపదగా మార్చడమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, వేస్ట్ మేనేజ్‌మెంట్‌లో ఆంధ్రప్రదేశ్‌ను దేశంలోనే ముందంజలో నిలుపుతామని మంత్రి స్పష్టం చేశారు.


ఇవి కూడా చదవండి...

మల్లూరు లక్ష్మీనరసింహస్వామి ఆలయ అభివృద్ధిపై మంత్రి సీతక్క ఆదేశాలివే

హఫీజ్‌పేట్ ఘటన.. హోంగార్డ్ ఆనంద్‌పై వేటు

Read Latest Telangana News And Telugu News

Updated Date - Sep 19 , 2026 | 09:46 PM