విశాఖలో ఘోర ప్రమాదం.. గాజువాకలో కుప్పకూలిన రెండంతస్తుల భవనం
ABN , Publish Date - May 03 , 2026 | 08:48 PM
విశాఖపట్నం జిల్లా గాజువాక పరిధిలోని వికాస్ నగర్‌లో ఆదివారం ఒక విషాద ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే..
గాజువాక, మే 03: విశాఖపట్నం జిల్లా గాజువాక పరిధిలోని వికాస్ నగర్‌లో ఆదివారం ఒక విషాద ఘటన చోటుచేసుకుంది. జాకీల సాయంతో ఇంటిని పైకి లేపే క్రమంలో రెండంతస్తుల భవనం ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. శిథిలాల కింద మరికొందరు చిక్కుకుని ఉండటంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి.
వికాస్ నగర్‌లో ఒక పాత భవనాన్ని ఆధునీకరించే క్రమంలో, పునాదుల నుంచి ఇంటిని పైకి లేపేందుకు యజమాని ప్రయత్నించారు. అయితే, పనులు జరుగుతుండగా భవనం ఒక్కసారిగా పేకమేడలా కూలిపోయింది. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు అప్రమత్తమై పోలీసులకు సమాచారం అందించారు. న్యూ పోర్ట్ పీఎస్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు, భవన యజమాని, పనులు చేపట్టిన కాంట్రాక్టర్ అనుమతులు తీసుకున్నారా లేదా అనే కోణంలో విచారణ జరుపుతున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి
బాలుడి చేతిలో పేలిన బ్యాటరీ.. తెగిపడిన వేళ్లు..
సిద్దిపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరి మృతి