‘యునోవా’తో సుశేషన్ హెల్త్ ఎంవోయూ
ABN , Publish Date - Nov 14 , 2026 | 05:03 AM
దేశవ్యాప్తంగా తల్లిపాల బ్యాంకులను ఏర్పాటు చేస్తున్న సుశేషన్ హెల్త్ ఫౌండేషన్ సంస్థ సీఐఐ సదస్సులో విశాఖ మెడ్‌టెక్ జోన్‌లోని కంపెనీతో ఎంవోయూ చేసుకుంది.
తల్లిపాల బాటిల్స్ శుభ్రం చేసే మెషీన్ల కొనుగోలుకు ఒప్పందం
విశాఖపట్నం, నవంబరు 13(ఆంధ్రజ్యోతి): దేశవ్యాప్తంగా తల్లిపాల బ్యాంకులను ఏర్పాటు చేస్తున్న సుశేషన్ హెల్త్ ఫౌండేషన్ సంస్థ సీఐఐ సదస్సులో విశాఖ మెడ్‌టెక్ జోన్‌లోని కంపెనీతో ఎంవోయూ చేసుకుంది. తల్లిపాలు సేకరించి పిల్లలకు అందించేందుకు వినియోగించే బాటిల్స్‌ను అత్యంత జాగ్రత్తగా శుభ్రం చేయాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో తల్లిపాల బాటిల్స్‌ను శుభ్రం చేసేందుకు అనుగుణమైన పరికరాలను తయారుచేసే మెడ్‌టెక్ జోన్‌లోని యునోవా ఇన్నోవేషన్స్ ప్రైవేటు లిమిటెడ్ సంస్థతో ఫౌండేషన్ ఒప్పందం చేసుకుంది.
ఈ సందర్భంగా ‘సుశేషన్’ చైర్మన్ డాక్టర్ కె.సంతోశ్ మాట్లాడుతూ... ‘కేజీహెచ్‌లో తల్లిపాల బ్యాంకును కొద్దిరోజుల్లో ప్రారంభించనున్నాం. ఈ తల్లిపాల బ్యాంకులో వంద బాటిల్స్ అందిస్తాం. ఇక్కడ వినియోగించే బాటిల్స్‌ను శుభ్రం చేసేందుకు పరికరాలు తీసుకుంటున్నాం. ఈ మెషీన్ ద్వారా రోజుకు 400 బాటిల్స్‌ను శుభ్రం చేయొచ్చు. శతవరి ఆయుర్వేదిక్ సంస్థతో మరో ఎంవోయూ చేసుకున్నాం. ఈ ఒప్పందం ద్వారా తల్లిపాలు తక్కువ ఉన్న తల్లులకు పోషకాలతో కూడిన లడ్డూలు అందిస్తాం’ అని చెప్పారు.
ఈ వార్తలనూ చదవండి:
జగన్ మాట్లాడటం దెయ్యాలు వేదాలు వల్లించినట్లుంది: మంత్రి లోకేశ్