మెజారిటీ తగ్గిందని.. తిట్ల దండకం!
ABN , Publish Date - Nov 29 , 2026 | 03:40 AM
ఆశించినంత మెజార్టీ రాలేదన్న కోపంతో ఎన్నికల సమయంలో పంచిన డబ్బులు, చీరలను సర్పంచ్‌గా ఎన్నికైన వ్యక్తి మామ గ్రామస్థుల నుంచి తిరిగి వసూలు చేశాడు.
డబ్బులు, చీరలు వెనక్కి ఇచ్చేసిన గ్రామస్థులు
కడప, నవంబరు 28 (ఆంధ్రజ్యోతి): ఆశించినంత మెజార్టీ రాలేదన్న కోపంతో ఎన్నికల సమయంలో పంచిన డబ్బులు, చీరలను సర్పంచ్‌గా ఎన్నికైన వ్యక్తి మామ గ్రామస్థుల నుంచి తిరిగి వసూలు చేశాడు. కడప జిల్లా రాజంపేట మండలం శేషమాంబపురం పంచాయతీకి ఇటీవల జరిగిన ఎన్నికల్లో టీడీపీ మద్దతుతో రమాదేవి సర్పంచ్‌గా ఎన్నికయ్యారు. 850 ఓట్లు ఉన్న రమాదేవి 8 ఓట్ల మెజారిటీతో గెలిచారు. అయితే అనుకున్న మెజారిటీ రాలేదన్న బాధతో ఆమె మామ వై.వెంకట సుబ్బరాజు పాపరాజుపల్లె రామాలయం మెట్లపై కూర్చుని తిట్లదండకం అందుకున్నారు. తమ వద్ద చీరలు, డబ్బులు తీసుకుని ప్రత్యర్థికి ఓట్లు వేశారంటూ బూతులు తిట్టడం మొదలు పెట్టారు. తాము ఇచ్చిన చీరలను, డబ్బులను వెనక్కు ఇవ్వాలని హెచ్చరించారు. ఆయన తిట్టే బూతులు భరించలేక తీసుకున్న చీరలు, డబ్బులను గ్రామస్థులు తిరిగిచ్చేశారు.
ఈ వార్తలనూ చదవండి:
అమరావతి నిర్మాణాలపై వైసీపీ తప్పుడు ప్రచారం.. నిజాలు తేల్చిన ఏపీ ఫ్యాక్ట్ చెక్..