భక్తురాలి నగల చోరీ.. నిందితురాలి అరెస్ట్
ABN , Publish Date - Mar 10 , 2026 | 08:00 PM
విజయవాలోని ఇంద్రకీలాద్రిపై వెలసిన కనకదుర్గమ్మ ఆలయంలో చోరీ జరిగిన విషయం తెలిసిందే. హైదరాబాద్‌కు చెందిన కాకర్ల సుష్మ కుటుంబ సభ్యులు విజయవాడలో జరిగిన కుంభాభిషేకం సందర్భంగా అమ్మవారి దర్శనానికి వచ్చారు. వివరాల్లోకి వెళితే..
విజయవాడ, మార్చి10: ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఇంద్రకీలాద్రిపై వెలసిన కనకదుర్గమ్మ ఆలయంలో చోరీ జరిగిన విషయం తెలిసిందే. హైదరాబాద్‌కు(Hyderabad) చెందిన కాకర్ల సుష్మ కుటుంబ సభ్యులు విజయవాడలో(Vijayawada) జరిగిన కుంభాభిషేకం సందర్భంగా అమ్మవారి దర్శనానికి వచ్చారు. ఈ సందర్భంగా ఆలయానికి భక్తులు(Devotees) భారీగా తరలి వచ్చారు. అయితే, సుష్మ క్యూలైన్లో నిలబడి అమ్మవారిని దర్శించుకుంటున్న సమయంలో ఓ మహిళ ఆమెను ఏమార్చి హ్యాండ్ బ్యాగ్‌లో ప్లాస్టిక్ బాక్స్‌లో ఉన్న 125 గ్రాములు బంగారు ఆభరణాలను చోరీ చేసి అక్కడ నుంచి ఉడాయించింది. దర్శనం తర్వాత సదరు భక్తురాలు నగలు చోరీ అయినట్లు గ్రహించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
విజయవాడ వన్ టౌన్ పోలీసులు ఆలయంలోని సీసీటీవీ ఫుటేజ్‌లను పరిశీలించారు. టెక్నాలజీ సాయంతో నిందితురాలు కోవెలకొండ నీరజను గుర్తించినట్లు ఏడిసీపీ గుణ్ణం రామకృష్ణ తెలిపారు. విశాఖపట్నం జిల్లా మధురవాడకు చెందిన ఆమె ఆచూకీ నాట్ గ్రిడ్ యాప్ ద్వారా తెలుసుకున్నామన్నారు. నీరజను అరెస్టు చేసి, 18 లక్షలు విలువచేసే 125 గ్రాములు బంగారాన్ని స్వాధీనం చేసుకున్నామని తెలిపారు.
ఇవి కూడా చదవండి...
వంటగ్యాస్ షాక్.. దేశంలో ఎల్పీజీ ధరలు భారీగా పెంపు
Read Latest AP News And Telugu News