Share News

మద్యం తాగిన పైలట్‌ షార్జా విమానం రద్దు

ABN , Publish Date - Oct 11 , 2026 | 04:48 AM

విజయవాడలోని గన్నవరం విమానాశ్రయం నుంచి షార్జా వెళ్లాల్సిన విమానాన్ని అధికారులు రద్దు చేశారు. విమాన పైలట్‌ ఒకరు మద్యం తాగి ఉండడంతో చివరి నిమిషంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.

మద్యం తాగిన పైలట్‌ షార్జా విమానం రద్దు

గన్నవరం,అక్టోబరు 10(ఆంధ్రజ్యోతి): విజయవాడలోని గన్నవరం విమానాశ్రయం నుంచి షార్జా వెళ్లాల్సిన విమానాన్ని అధికారులు రద్దు చేశారు. విమాన పైలట్‌ ఒకరు మద్యం తాగి ఉండడంతో చివరి నిమిషంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే, అప్పటికే షార్జా వెళ్లేందుకు సిద్ధమైన విమానం రద్దు కావడంతో ప్రయాణికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. శనివారం రాత్రి ఎయిర్‌ ఇండియా ఎక్స్‌ప్రెస్‌ విమానం 7.30 గంటలకు హైదరాబాద్‌ నుంచి గన్నవరానికి చేరుకుంది. ఇదే విమానం తిరిగి 9 గంటలకు షార్జా వెళ్లాల్సి ఉంది. అయితే, ఆ విమానం పైలట్స్‌లో ఒకరు మద్యం తాగి ఉండడాన్ని అధికారులు గుర్తించారు. దీంతో ఆ విమానాన్ని రద్దు చేసినట్లు ప్రకటించారు. కాగా, గన్నవరం నుంచి షార్జాకు 148 మంది ప్రయాణికులు వెళ్లాల్సి ఉన్నట్లు తెలిసింది. విమానాన్ని రద్దు చేసినట్టు ప్రకటించడంతో ప్రయాణికుల్లో కొందరు వాదనకు దిగారు.

ఈ వార్తలనూ చదవండి:

ఎవరు అడ్డొచ్చినా నెట్టుకుంటూ పోతాం

జయహో బీసీ

దసరాలోపు 2వ విడత తల్లికి వందనం..!

Updated Date - Oct 11 , 2026 | 04:48 AM