Share News

వీశాట్‌ నోటిఫికేషన్‌ విడుదల

ABN , Publish Date - Nov 15 , 2026 | 04:16 AM

యువతకు అత్యున్నత ఉద్యోగాలు కల్పించడం, వారిని గొప్ప పారిశ్రామికవేత్తలుగా ఎదిగేలా చేయడం, పరిశోధనలకు పెద్దపీట వేయడంలాంటి సమున్నత లక్ష్యాలతో తాము ముందుకెళుతున్నామని విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ వైస్‌ చాన్సలర్‌...

వీశాట్‌ నోటిఫికేషన్‌ విడుదల

  • జనవరి 1 నుంచి మార్చి 31 వరకు ప్రవేశ పరీక్ష

  • విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్‌ కేవీ కృష్ణకిశోర్‌

గుంటూరు(విద్య), నవంబరు 14 (ఆంధ్రజ్యోతి): యువతకు అత్యున్నత ఉద్యోగాలు కల్పించడం, వారిని గొప్ప పారిశ్రామికవేత్తలుగా ఎదిగేలా చేయడం, పరిశోధనలకు పెద్దపీట వేయడంలాంటి సమున్నత లక్ష్యాలతో తాము ముందుకెళుతున్నామని విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ వైస్‌ చాన్సలర్‌ ప్రొఫెసర్‌ కేవీ క్రిష్ణకిశోర్‌ తెలిపారు. గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం వడ్లమూడిలోని విజ్ఞాన్‌ వర్సిటీలో శనివారం వీశాట్‌ 2027-28 నోటిఫికేషన్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వడ్లమూడిలోని విజ్ఞాన్స్‌ యూనివర్సిటీకు అనుబంధంగా ప్రారంభించిన విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ హైదరాబాద్‌ ఆఫ్‌ క్యాంపస్‌లో విద్యార్థులకు విభిన్న కోర్సులు అందుబాటులో ఉన్నట్టు వీసీ తెలిపారు.

బీటెక్‌లో అగ్రికల్చర్‌, బయోటెక్నాలజీ, బయోఇన్ఫర్మాటిక్స్‌, బయోమెడికల్‌, కెమికల్‌, సివిల్‌, సీఎస్‌ఈ పాటు ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌, మెషిన్‌ లెర్నింగ్‌, సైబర్‌ సెక్యూరిటీ, కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ బిజినెస్‌ సిస్టమ్స్‌, డేటాసైన్స్‌, ఐవోటీ, ఈసీఈ, ఈసీఈ-వీఎల్‌ఎస్ఐ, ఈఈఈ, ఫుడ్‌ టెక్నాలజీ, ఐటీ, మెకానికల్‌, రోబోటిక్స్‌ అండ్‌ ఆటోమేషన్‌, టెక్స్‌టైల్‌ టెక్నాలజీ, బీఫార్మసీ, ఫార్మా-డీ, ఎం.ఫార్మసీ, బీఎస్సీ(హానర్స్‌) అగ్రికల్చర్‌, డిప్లొమా(సీఎ్‌సఈ. ఈసీఈ, మెకానికల్‌, ఈఈఈ) కోర్సులకు ఆన్‌లైన్‌లో జనవరి 1 నుంచి నుంచి మార్చి 31 వరకు ప్రవేశ పరీక్ష జరుగుతుందని వెల్లడించారు. వర్సిటీ వెబ్‌సైట్‌ (https://admissions.vignan.ac.in/ac) ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.


వర్సిటీ డైరెక్టర్‌ అడ్మిషన్స్‌ అప్పారి గౌరీ శంకరరావు మాట్లాడుతూ వీశాట్‌ దరఖాస్తులు గుంటూరు, విజయవాడ, హైదరాబాద్‌, విశాఖ, ఏలూరు, రాజమండ్రిలోని విజ్ఞాన్‌ సంస్థలు, కార్యాలయాల్లో అందుబాటులో ఉంటాయని చెప్పారు. వీశాట్‌లో తొలి 100లోపు ర్యాంకులు సాధించిన వారికి 50 శాతం, 101-400 లోపు ర్యాంకుల సాధించిన వారికి 25 శాతం, 401-2000లోపు ర్యాంకులు సాధించిన వారికి 10 శాతం ఫీజును స్కాలర్‌షిప్‌గా అందజేస్తున్నట్టు వెల్లడించారు. ఇంటర్‌ మార్కులు, జేఈఈ, మెయిన్స్‌, ఎంసెట్‌ ర్యాంకుల ఆధారంగా కూడా ఫీజు స్కాలర్‌షిప్‌నకు అవకాశం ఉందని వివరించారు.

అన్ని విభాగాల్లో 25 శాతం సీట్లను స్కాలర్‌షిప్‌ కింద కేటాయించామన్నారు. బీటెక్‌ కోర్సుతోపాటుగా ఆసక్తి ఉన్న విద్యార్థులకు సమాంతరంగా సివిల్స్‌, బ్యాంకింగ్‌, ఫైనాన్స్‌ రంగాలతోపాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలకు కోచింగ్‌ ఇస్తున్నామని తెలిపారు. విద్యార్థులకు ఇన్నోవేటర్స్‌ క్లబ్‌, టెక్నాలజీ ఇంక్యుబేషన్‌ సెంటర్‌ అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో వర్సిటీ ట్రైనింగ్‌ అండ్‌ ప్లేస్‌మెంట్‌ డీన్‌ డాక్టర్‌ ధూళిపాళ్ల విజయక్రిష్ణ, డీన్‌ ఏఏఏ ప్రొఫెసర్‌ దిరిశాల విజయరాము, డైరెక్టర్‌ అడ్మిషన్స్‌, డిప్యూటీ రిజిస్ర్టార్‌ ఏ.గౌరిశంకరరావు పాల్గొన్నారు.

ఈ వార్తలనూ చదవండి:

జాతీయ బాలల దినోత్సవం.. చిన్నారులకు సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ శుభాకాంక్షలు

కార్పొరేషన్‌పై కూటమి జెండా ఎగరేద్దాం

Updated Date - Nov 15 , 2026 | 04:23 AM