Share News

శ్రీవారి ఆలయంలోనిప్రాచీన మండపాల పరిరక్షణ

ABN , Publish Date - Sep 14 , 2026 | 04:32 AM

తిరుమల శ్రీవారి ఆలయంలో ఉన్న పురాతన మండపాలను శాస్త్రీయ రసాయన పద్ధతుల ద్వారా శుభ్రపరిచి, పరిరక్షించేందుకు పుణేకు చెందిన లార్డ్‌ వేంకటేశ్వర చారిటబుల్‌ అండ్‌ రిలిజియస్‌ ట్రస్టు ముందుకొచ్చింది.

శ్రీవారి ఆలయంలోనిప్రాచీన మండపాల పరిరక్షణ

  • శాస్త్రీయ రసాయన పద్ధతుల్లో పైకప్పు, స్తంభాల శుద్ధి

తిరుపతి(టీటీడీ), సెప్టెంబరు 13(ఆంధ్రజ్యోతి): తిరుమల శ్రీవారి ఆలయంలో ఉన్న పురాతన మండపాలను శాస్త్రీయ రసాయన పద్ధతుల ద్వారా శుభ్రపరిచి, పరిరక్షించేందుకు పుణేకు చెందిన లార్డ్‌ వేంకటేశ్వర చారిటబుల్‌ అండ్‌ రిలిజియస్‌ ట్రస్టు ముందుకొచ్చింది. తొలిదశలో ఆలయ ఉత్తర, పశ్చిమ, దక్షిణ భాగాల్లోని పైకప్పు, స్తంభాల రసాయన శుద్ధి పనులు కొంతవరకు పూర్తయ్యాయి. మిగిలిన పనులు కొనసాగుతున్నాయి. ఈ పనులన్నీ ఆర్కియాలజీ సర్వే ఆఫ్‌ ఇండియా (ఏఎస్ఐ) మైసూరు విభాగానికి చెందిన మాజీ సూపరింటెండెంట్‌, ఆర్కియాలజికల్‌ కెమిస్ట్‌ అంబేద్కర్‌ పర్యవేక్షణలో సాగుతున్నాయి. రాతి శిల్పాల ఉపరితలాన్ని శుద్ధి చేయడంతో పాటు నాచు తొలగింపు చర్యలు చేపట్టారు. రాతి నిర్మాణాన్ని బలోపేతం చేయడం, వెలుపలి ఉపరితలాలపై చిన్న చెట్లు మొలకెత్తకుండా నిరోధించడం, నీరు చొరబడకుండా రక్షణ పూత వంటి చర్యలు చేపట్టారు.

ఈ వార్తలనూ చదవండి..

ప్రజా సమస్యల పరిష్కారానికి చర్యలు: కలిశెట్టి

‘డీఎస్సీపై చర్చకు జగన్‌ సిద్ధమా?’

Updated Date - Sep 14 , 2026 | 04:32 AM