20 వరకు ఎస్‌ఎస్‌డీ టోకెన్ల జారీ నిలిపివేత
ABN , Publish Date - Sep 14 , 2026 | 04:19 AM
శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆదివారం నుంచి ఎస్‌ఎస్‌డీ టోకెన్ల జారీ నిలిపివేశారు. ఈ మేరకు టోకెన్ల జారీ కేంద్రాల వద్ద సూచిక బోర్డులను ఏర్పాటు చేశారు. సాధారణంగా స్లాటెడ్ సర్వదర్శనం (ఎస్‌ఎస్‌డీ) టోకెన్లను తిరుపతిలోని భూదేవి కాంప్లెక్స్, విష్ణు నివాసం, శ్రీనివాసం అతిథి సముదాయాల్లో మరుసటి రోజు స్లాట్లకు సంబంధించి టోకెన్లు జారీ చేస్తారు.
బ్రహ్మోత్సవాల నేపథ్యంలో టీటీడీ నిర్ణయం
తిరుపతి(టీటీడీ), సెప్టెంబరు 13(ఆంధ్రజ్యోతి): శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆదివారం నుంచి ఎస్‌ఎస్‌డీ టోకెన్ల జారీ నిలిపివేశారు. ఈ మేరకు టోకెన్ల జారీ కేంద్రాల వద్ద సూచిక బోర్డులను ఏర్పాటు చేశారు. సాధారణంగా స్లాటెడ్ సర్వదర్శనం (ఎస్‌ఎస్‌డీ) టోకెన్లను తిరుపతిలోని భూదేవి కాంప్లెక్స్, విష్ణు నివాసం, శ్రీనివాసం అతిథి సముదాయాల్లో మరుసటి రోజు స్లాట్లకు సంబంధించి టోకెన్లు జారీ చేస్తారు. అయితే బ్రహ్మోత్సవాలను దృష్టిలో ఉంచుకుని 14నుంచి 20వ తేదీ వరకు టోకెన్ల జారీ నిలిపివేశారు. 20వ తేదీ వరకు భక్తులు నేరుగా వైకుంఠం-2 క్యూ కాంప్లెక్స్ క్యూలైన్లలోకి వెళ్లి శ్రీవారిని దర్శించుకోవచ్చు. 21న దర్శనానికి సంబంధించి 20న సాయంత్రం 4 గంటలకు టోకెన్లు జారీ చేయనున్నారు. వాస్తవానికి పలువురు భక్తులు మంగళవారం దర్శనానికి సంబంధించి టోకెన్లను సోమవారం ఉదయం జారీ చేస్తారని ఆదివారమే టోకెన్ జారీ కేంద్రాల వద్దకు చేరుకున్న భక్తులు సాయంత్రం వరకు ఎదురుచూశారు. చివరకు టోకెన్లు జారీ చేయరని తెలిసి తీవ్ర నిరాశకు లోనయ్యారు. అధికారులు ముందుగా సమాచారం ఇచ్చి ఉంటే బాగుండేదని ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ వార్తలనూ చదవండి..
ప్రజా సమస్యల పరిష్కారానికి చర్యలు: కలిశెట్టి
‘డీఎస్సీపై చర్చకు జగన్ సిద్ధమా?’