కార్పొరేషన్‌లో విలీనం వద్దు
ABN , Publish Date - Sep 13 , 2026 | 11:54 PM
కార్పొరేషన్‌లో తోటపాలెం పంచాయతీ విలీనం వద్దని, పంచాయతీగానే కొనసాగించాలని గ్రామస్థులు డిమాండ్ చేశారు.
తోటపాలెంలో గ్రామస్థుల ర్యాలీ
ఎచ్చెర్ల, సెప్టెంబరు 13(ఆంధ్రజ్యోతి): కార్పొరేషన్‌లో తోటపాలెం పంచాయతీ విలీనం వద్దని, పంచాయతీగానే కొనసాగించాలని గ్రామస్థులు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆదివారం తోటపాలెంలో ర్యాలీ చేపట్టారు. శ్రీకాకుళం నగరపాలక సంస్థలోకి తమ గ్రామాన్ని విలీనం చేయాలన్న ఆలోచన సరికాదన్నారు. విలీన ప్రతిపాదనలతో ఎదురైన ఇబ్బందులపై స్థానికులు చర్చించారు. ప్రజాభిప్రాయాన్ని లెక్కచేయకుండా బలవంతంగా విలీనం చేస్తే ఎన్నికలు బహిష్కరి స్తామని హెచ్చరించారు.