టీటీడీ డిప్యూటీ ఈవో లోకనాథం అరెస్ట్
ABN , Publish Date - Sep 04 , 2026 | 05:08 AM
ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టిన టీటీడీ డిప్యూటీ ఈవో మెండు లోకనాథాన్ని ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు. ఆయన ఇల్లు, కార్యాలయాల్లో అధికారులు బుధవారం ప్రారంభించిన సోదాలు గురువారం ఉదయం 9 గంటల వరకు కొనసాగాయి.
అక్రమాస్తుల కేసులో అదుపులోకి తీసుకున్న ఏసీబీ
14 రోజుల రిమాండ్ విధించిన ఏసీబీ కోర్టు
నెల్లూరు జిల్లా సెంట్రల్ జైలుకు తరలింపు
తిరుపతి/నెల్లూరు, సెప్టెంబరు 3(ఆంధ్రజ్యోతి): ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టిన టీటీడీ డిప్యూటీ ఈవో మెండు లోకనాథాన్ని ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు. ఆయన ఇల్లు, కార్యాలయాల్లో అధికారులు బుధవారం ప్రారంభించిన సోదాలు గురువారం ఉదయం 9 గంటల వరకు కొనసాగాయి. తర్వాత లోకనాథాన్ని అదుపులోకి తీసుకున్నారు. రుయాస్పత్రిలో వైద్యపరీక్షల అనంతరం నెల్లూరులోని ఏసీబీ కోర్టు ఎదుట హాజరుపరిచారు. ఈ కేసులో లోకనాథానికి 14 రోజుల పాటు జ్యుడీషియల్ రిమాండ్ విధిస్తూ ఏసీబీ కోర్టు ప్రత్యేక న్యాయాధికారి జి. గీత ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో పోలీసులు ఆయన్ను నెల్లూరు జిల్లా సెంట్రల్ జైలుకు తరలించారు.
ఇవి కూడా చదవండి
రోహిత్ శర్మ రిటైర్‌మెంట్‌పై క్లారిటీ
పదవి ఉన్నా.. లేకున్నా ప్రజలతోనే: మాజీ మంత్రి చిన్నారెడ్డి