Share News

శాసనాల పూర్తిస్థాయి డిజిటలైజేషన్‌ టీటీడీ అంగీకారం

ABN , Publish Date - Nov 14 , 2026 | 03:36 AM

రాష్ట్రంలో గ్రామ పంచాయతీ తొలి విడత ఎన్నికలకు నోటిఫికేషన్‌ జారీ అయింది. మొదటి విడతలో 3,967 సర్పంచ్‌, 40,012 వార్డు సభ్యుల స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు.

శాసనాల పూర్తిస్థాయి డిజిటలైజేషన్‌ టీటీడీ అంగీకారం

  • 1 నుంచి 11 వరకు ఏఎస్ఐ ఆధ్వర్యంలో పనులు

  • త్వరలో భారత్‌-శ్రీ వెబ్‌సైట్‌ ద్వారా ప్రదర్శన

తిరుమల, నవంబరు 13(ఆంధ్రజ్యోతి): తిరుమల శ్రీవారి ఆలయ ప్రాకార గోడలపై చెక్కి ఉన్న చారిత్రక శాసనాలను పూర్తిస్థాయిలో డిజిటలైజేషన్‌ చేసేందుకు టీటీడీ అంగీకారం తెలిపింది. భారత పురావస్తు శాఖ(ఏఎస్ఐ) ఆధ్వర్యంలో డిసెంబరు 1 నుంచి 11వ తేదీ వరకు ఈ పనులు చేపట్టనున్నారు. ఏఎస్ఐ ఎపిగ్రఫీ విభాగం డైరెక్టర్‌ మునిరత్నం రెడ్డి విజ్ఞప్తి మేరకు టీటీడీ గురువారం ఈ నిర్ణయం తీసుకుంటూ ఉత్తర్వులు జారీ చేసింది. దేశంలోని ప్రముఖ ఆలయాల్లోని శాసనాలను భద్రపరచడంలో భాగంగా ప్రధాని మోదీ ‘భారత్‌-శ్రీ’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.

ఇందులో భాగంగా ఆర్కియాలజీ విభాగం తిరుమలలో శాసనాలను డిజిటలైజేషన్‌ చేసే పనులను ప్రారంభించింది. పురావస్తు శాఖ ఇప్పటికే పలు దఫాల్లో 97 శాసనాలను సేకరించి భద్రపరిచింది. తాజాగా భారత్‌-శ్రీ కార్యక్రమంలో భాగంగా అక్టోబరు నెలలో మరికొన్ని శాసనాలను దక్షిణ, ఉత్తర ప్రాకారాలపై ఏఎస్ఐ డైరెక్టర్‌ మునిరత్నం రెడ్డి బృందం కాపీ చేసింది.

ఆయన ఆధ్వర్యంలో మొత్తం 21 మంది అధికారులు, సిబ్బంది తిరుమల ఆలయంలోని ప్రాకారాలపై ఉన్న శాసనాలను నకలు తీసి, వాటిని డిజిటలైజ్‌ చేయనున్నారు. ఈక్రమంలో ఏఎస్ఐ బృందం డిసెంబరు 1 నుంచి 11వ తేదీ వరకు 11 రోజుల పాటు రోజూ ఉదయం 8 నుంచి సాయంత్రం 6 గంటల మధ్యలో నకలు తీయనున్నారు. వీరికి బయోమెట్రిక్‌ ప్రవేశానికి అనుమతించారు.

ఈ వార్తలనూ చదవండి:

‘గుర్తు’ పట్టకపోతే నష్టం!

జగన్ మాట్లాడటం దెయ్యాలు వేదాలు వల్లించినట్లుంది: మంత్రి లోకేశ్

Updated Date - Nov 14 , 2026 | 03:39 AM