Share News

తిరుపతి: శ్రీనివాసమంగాపురం ఎల్లమ్మ ఆలయంలో భారీ చోరీ

ABN , Publish Date - Jul 16 , 2026 | 12:46 PM

తిరుపతి శ్రీనివాసమంగాపురం ఎల్లమ్మ ఆలయంలో అర్ధరాత్రి దుండగులు సీసీటీవీ కెమెరాలు, హుండీ పగులగొట్టి రూ.5 లక్షల నగదు, అమ్మవారి బంగారు తాళి, వాటర్ కాయిన్ బాక్స్ చోరీ చేశారు.

తిరుపతి: శ్రీనివాసమంగాపురం ఎల్లమ్మ ఆలయంలో భారీ చోరీ
Tirupati Temple Theft

తిరుపతి, జులై 16: చంద్రగిరి మండలం శ్రీనివాసమంగాపురంలోని వస్కోటు ఎల్లమ్మ దేవాలయంలో అర్ధరాత్రి భారీ చోరీ జరిగింది. ఆలయం వెనుక వైపు నుంచి లోపలికి చొరబడిన దుండగులు.. ప్రధాన గేటు తాళాలు పగులగొట్టి లోపలికి ప్రవేశించారు. ఆధారాలు దొరకకుండా ఉండేందుకు అక్కడి సీసీటీవీ కెమెరాలనూ ధ్వంసం చేశారు. అనంతరం అమ్మవారి విగ్రహానికి ఉన్న 11 గ్రాముల బంగారు తాళిబొట్టుతో పాటు, ఆలయ ప్రాంగణంలో ఉన్న మినరల్ వాటర్ కాయిన్ బాక్స్‌ను కూడా కేటుగాళ్లు ఎత్తుకెళ్లారు.


ఈ ఆలయంలో ఏళ్ల తరబడి హుండీ లెక్కింపు చేపట్టకపోవడంతో.. అందులో భారీగా నగదు ఉన్నట్లు తెలుస్తోంది. దుండగులు ఆ హుండీని పగులగొట్టి అందులోని నగదంతా దోచుకెళ్లారు. నగదుతో పాటు బంగారం, ఇతర వస్తువులు చోరీకి గురైనట్లు అధికారులు గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్లూస్ టీంతో ఆధారాలు సేకరించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి, నిందితుల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి...

జగన్ రెడ్డిది రాక్షస మనస్తత్వం.. మంత్రి నిమ్మల ధ్వజం

తుది దశకు అహ్మదాబాద్ విమాన ప్రమాద దర్యాప్తు: కేంద్రమంత్రి

Read Latest AP News And Telangana News And National News

And Telugu News

Updated Date - Jul 16 , 2026 | 02:11 PM