నవరాత్రి బ్రహ్మోత్సవాలకు నేడు అంకురార్పణ
ABN , Publish Date - Oct 11 , 2026 | 05:07 AM
నవరాత్రి బ్రహ్మోత్సవాలకు తిరుమల సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. ఈ నెల 12 నుంచి 20వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయి.
రేపటి నుంచి వాహన సేవలు
తిరుమల, అక్టోబరు 10(ఆంధ్రజ్యోతి): నవరాత్రి బ్రహ్మోత్సవాలకు తిరుమల సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. ఈ నెల 12 నుంచి 20వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయి. చాంద్రమానం ప్రకారం మూడేళ్లకోసారి అధికమాసం వస్తుంది. ఇలా వచ్చిన సందర్భాల్లో కన్యామాసం(భాద్రపదం)లో వార్షిక బ్రహ్మోత్సవాలు, దసరా నవరాత్రుల్లో (ఆశ్వయుజం) నవరాత్రి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు. నవరాత్రి బ్రహ్మోత్సవాలకు ఆదివారం రాత్రి 7 నుంచి 8 గంటల మధ్య శాస్ర్తోక్తంగా అంకురార్పణ చేస్తారు. నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో ధ్వజారోహణం, ధ్వజావరోహణం ఉండవు. ప్రధానంగా అక్టోబరు 16న గరుడ వాహన సేవ, 17న పుష్పక విమాన సేవ, 19న స్వర్ణ రథోత్సవం, 20న చక్రస్నాన వేడుక నిర్వహిస్తారు. వాహనసేవలు ఉదయం 8 నుంచి 10 గంటల వరకు, రాత్రి 7 నుంచి 9 గంటల వరకు జరుగుతాయి. గరుడ వాహనసేవ మాత్రం సాయంత్రం 6.30 గంటల నుంచి 11.30 గంటల వరకు నిర్వహిస్తారు.
ఈ వార్తలనూ చదవండి:
ఎవరు అడ్డొచ్చినా నెట్టుకుంటూ పోతాం
దసరాలోపు 2వ విడత తల్లికి వందనం..!