శ్రీవారికి 121 కేజీల నూతన ఆభరణాల అలంకరణ
ABN , Publish Date - Nov 28 , 2026 | 05:57 AM
నూతన ఆభరణాలతో తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి శుక్రవారం ధగధగమెరిసిపోయారు. ఆ ఆభరణాలను అమిత భక్తిశ్రద్ధలతో దగ్గరుండి తయారు చేయించి సమర్పించిన దాత ఆనందానికి అవధుల్లేవు.
దర్శించుకుని సంతోషం వ్యక్తం చేసిన దాత వర్ధమాన్ జైన్
తిరుమల, నవంబరు 27 (ఆంధ్రజ్యోతి): నూతన ఆభరణాలతో తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి శుక్రవారం ధగధగమెరిసిపోయారు. ఆ ఆభరణాలను అమిత భక్తిశ్రద్ధలతో దగ్గరుండి తయారు చేయించి సమర్పించిన దాత ఆనందానికి అవధుల్లేవు. చెన్నైకి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త వర్ధమాన్ జైన్, రాధిక జైన్ దంపతులు రూ.206 కోట్ల విలువైన 121 కేజీల బంగారు ఆభరణాలను సీఎం చంద్రబాబు సమక్షంలో టీటీడీకి గురువారం సమర్పించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో సీఎం ఆదేశం, దాత విజ్ఞప్తి మేరకు శుక్రవారం అభిషేకం అనంతరం ఆలయ అర్చకులు నూతన ఆభరణాలను గర్భాలయంలోని మూలవిరాట్టుకు ఆలంకరించారు. అనంతరం జైన్ దంపతులు కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారిని దర్శించుకున్నారు. తాము సమర్పించిన ఆభరణాల నడుమ శ్రీవారిని కన్నులారా తిలకించి సంతోషం వ్యక్తం చేశారు.
ఈ వార్తలనూ చదవండి:
డీలిమిటేషన్ బిల్లుతో అన్ని రాష్ట్రాలకు న్యాయం.. మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు: సీఎం చంద్రబాబు
బిహార్ ఎమ్మెల్యే కూతురి పెళ్లి.. చీపుర్లతో ఊడ్చేంత డబ్బు..