శ్రీవారి హుండీ ఆదాయం కొత్త రికార్డు
ABN , Publish Date - Oct 07 , 2026 | 04:07 AM
తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం రికార్డులు సృష్టిస్తోంది. గడిచిన తొమ్మిది నెలల్లో భక్తులు రూ.1,129.04 కోట్ల విలువైన కానుకలు సమర్పించారు. సాధారణంగా వారాంతాలు, విశేష పర్వదినాలు, ఉత్సవాల సమయంలోనే తిరుమలలో హుండీ ఆదాయం ఎక్కువగా లభిస్తుంటుంది.
తొమ్మిది నెలల్లో రూ.1,129 కోట్ల కానుకలు
తిరుమల, అక్టోబరు 6(ఆంధ్రజ్యోతి): తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం రికార్డులు సృష్టిస్తోంది. గడిచిన తొమ్మిది నెలల్లో భక్తులు రూ.1,129.04 కోట్ల విలువైన కానుకలు సమర్పించారు. సాధారణంగా వారాంతాలు, విశేష పర్వదినాలు, ఉత్సవాల సమయంలోనే తిరుమలలో హుండీ ఆదాయం ఎక్కువగా లభిస్తుంటుంది. అయితే కొద్ది నెలలుగా వీటితో సంబంధం లేకుండా తిరుమల నిత్యం భక్తులతో రద్దీగా ఉంటోంది. ఈక్రమంలో హుండీ ఆదాయం కూడా ప్రతి నెలా రూ.110 కోట్లకు తగ్గకుండా వస్తోంది. ఈ ఏడాది పరిశీలిస్తే జనవరిలో రూ.124.36 కోట్లు, ఫిబ్రవరిలో రూ.110.92 కోట్లు, మార్చిలో రూ.125.24 కోట్లు, ఏప్రిల్‌లో రూ.115.84 కోట్లు, మేలో రూ.120.28 కోట్లు, జూన్‌లో రూ.128.30 కోట్లు, జూలైలో రూ.140.25 కోట్లు, ఆగస్టులో రూ.137.44 కోట్లు, సెప్టెంబరు నెలలో రూ.126.41 కోట్ల చొప్పున మొత్తం రూ.1,129.04 కోట్లు హుండీ ఆదాయం లభించింది. ఇందులో అత్యధికంగా సెప్టెంబరు 10వ తేదీన రూ.6.34 కోట్లు, మార్చి 4వ తేదీన అత్యల్పంగా రూ.1.45 కోట్లు లభించింది. గతేడాదిలో జనవరి నుంచి సెప్టెంబరు నెల వరకు రూ.1,023.22 కోట్లు లభించింది.
ఈ వార్తలనూ చదవండి..
అమరావతి పనుల్లో వేగం పెంచాలి.. ప్రతి నెల రూ. 2వేల కోట్ల పనులు పూర్తి చేయాలి: సీఎం
స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేన పోటీ చేసే స్థానాలు ఖరారు..!