తిరుమలకు నో బైక్ ‘రైడ్స్’
ABN, Publish Date - Oct 03 , 2026 | 04:07 AM
భక్తుల భద్రతను దృష్టిలో పెట్టుకుని తిరుమలకు రాపిడో, ఓలా, ఉబర్ బైక్ రైడ్‌లను అనుమతించకూడదని టీటీడీ నిర్ణయం తీసుకుంది. గత నెల 26వ తేదీన హైదరాబాద్‌కు చెందిన సునీల్ శ్రీవారి దర్శనం ముగించుకుని....
రాపిడో, ఓలా, ఉబర్ రైడ్స్‌పై నిషేధం
యాప్‌లలో తిరుమల ఆప్షన్ కనిపించకుండా ఉండేలా యోచన
తిరుమల, అక్టోబరు 2(ఆంధ్రజ్యోతి): భక్తుల భద్రతను దృష్టిలో పెట్టుకుని తిరుమలకు రాపిడో, ఓలా, ఉబర్ బైక్ రైడ్‌లను అనుమతించకూడదని టీటీడీ నిర్ణయం తీసుకుంది. గత నెల 26వ తేదీన హైదరాబాద్‌కు చెందిన సునీల్ శ్రీవారి దర్శనం ముగించుకుని తిరుపతి ఎయిర్‌పోర్టుకు రాపిడో బైక్‌ను బుక్ చేసుకున్నారు. ఎయిర్‌పోర్టుకు వెళ్లే క్రమంలో తిరుమల మొదటిఘాట్‌రోడ్డులోని 26వ మలుపు వద్ద వేగంగా క్యాష్‌బారియన్‌ను ఢీకొనడంతో రాపిడో బైకర్ అక్కడికక్కడే మృతి చెందగా, సునీల్ తీవ్రంగా గాయపడ్డారు. ఈ విషయాన్ని టీటీడీ తీవ్రంగా పరిగణించింది. తిరుమల, ఘాట్‌రోడ్లలో రాపిడో, ఉబర్, ఓలా బైక్ రైడ్‌లను నిషేధించాలని నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగానే అలిపిరి తనిఖీ కేంద్రంలో ‘నాట్ ఎలౌడ్’ అనే పోస్టర్లను ఏర్పాటు చేశారు. ‘తిరుమల ఘాట్ రోడ్లలో కేవలం వ్యక్తిగత ద్విచక్రవాహనాలకు మాత్రమే ప్రయాణించే అవకాశం ఉంది. రాపిడో, ఓలా, ఉబర్ తదితర యాప్‌ల ద్వారా బుక్ చేసుకున్న ద్విచక్రవాహనాలు తిరుమలకు అనుమతించబడవు’ అంటూ పేర్కొంది. అలాగే ఈ యాప్‌ల ద్వారా వచ్చే ద్విచక్రవాహనాలపై ప్రత్యేక నిఘా ఉంచాలని తనిఖీ సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. ఇక, ఇలాంటి యాప్‌లలో తిరుమలకు రైడ్ ఆప్షన్ కనిపించకుండా ఉండేలా సంబంధిత సంస్థలను సంప్రతించాలని కూడా టీటీడీ ఆలోచనలు చేస్తోంది.
ఈ వార్తలనూ చదవండి..
స్వచ్ఛతే ఆరోగ్యానికి తొలిమెట్టు
శ్రీవారి ఆలయానికి ‘స్వచ్ఛ’ అవార్డు
Updated at - Oct 03 , 2026 | 04:07 AM