టిప్పర్‌ను ఢీకొన్న కారు.. ముగ్గురి దుర్మరణం
ABN , Publish Date - Nov 15 , 2026 | 05:08 AM
తిరుమల శ్రీవారి దర్శనానికి వెళుతుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు దుర్మరణం పాలయ్యారు.
చంద్రగిరి, నవంబరు 14(ఆంధ్రజ్యోతి): తిరుమల శ్రీవారి దర్శనానికి వెళుతుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు దుర్మరణం పాలయ్యారు. చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం మండలం, గుర్రకొండవాండ్ల ఊరుకు చెందిన చంద్రగిరి లక్ష్మీనారాయణ(31) కారు డ్రైవరుగా జీవనం సాగిస్తున్నాడు.ఆయన తండ్రి సిద్ధయ్య(65), పెదనాన్న సుబ్రమణ్యం(67), బంధువు కుప్పాల రజని(55)తో కలిసి శనివారం రాత్రి స్వగ్రామం నుంచి తిరుమలకు కారులో బయలుదేరారు.
చంద్రగిరి మండలం, రవణప్పగారిపల్లె వద్ద జాతీయ రహదారి నుంచి సింగిల్ రోడ్డులోకి లక్ష్మీనారాయణ కారును మళ్లించాడు. స్పీడు బ్రేకర్స్ ఉండడంతో ముందు వెళుతున్న టిప్పర్ వేగం తగ్గగా వీరి వాహనం వేగంగా ఢీకొంది. ఈప్రమాదంలో లక్ష్మీనారాయణ, సిద్ధయ్య, రజని అక్కడికక్కడే మృతి చెందారు. సుబ్రమణ్యాన్ని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
ఈ వార్తలనూ చదవండి:
జాతీయ బాలల దినోత్సవం.. చిన్నారులకు సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ శుభాకాంక్షలు
కార్పొరేషన్‌పై కూటమి జెండా ఎగరేద్దాం