కూటమి చెప్పిందంటే చేసి తీరుతుంది: వర్ల
ABN , Publish Date - Oct 20 , 2026 | 05:10 AM
కూటమి ప్రభుత్వం చెప్పిందంటే చేసి తీరుతుందని ఎమ్మెల్సీ వర్ల రామయ్య పేర్కొన్నారు.
అమరావతి, అక్టోబరు 19(ఆంధ్రజ్యోతి): కూటమి ప్రభుత్వం చెప్పిందంటే చేసి తీరుతుందని ఎమ్మెల్సీ వర్ల రామయ్య పేర్కొన్నారు. సోమవారం టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ సూపర్ సిక్స్ పథకాలను సూపర్ హిట్ చేశామన్నారు. రాష్ట్రానికి 26 లక్షల కోట్ల రూపాయల భారీ పెట్టుబడులను ఆకర్షించేలా పారిశ్రామిక వాతావరణాన్ని సిద్ధం చేసిన ఘనత కూటమి ప్రభుత్వానిదని చెప్పారు. రాష్ట్రంలో ప్రజారంజక పాలన అందిస్తున్నామని, అందుకే కూటమికి ఓట్లేయాలని ధైర్యం గా అడగటానికి కూటమి ప్రభుత్వం ముందుకు వస్తోందన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీల అభ్యున్నతి కోసం 34 శాతం రిజర్వేషన్లు కల్పించాలన్న బలమైన సంకల్పంతో ప్రభుత్వం ముందడుగు వేస్తోందని, గతంలో ఏ పార్టీ చేయని విధంగా ఈ ఎన్నికల్లో 10 మంది మైనార్టీలకు మున్సిపల్ అభ్యర్థులుగా అవకాశం కల్పించామని తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి
ప్రధాని పర్యటన ఏర్పాట్లపై ఐబీ సమీక్ష
నేడు స్విమ్స్ ఓపీ, ఓటీలకు సెలవు