Share News

జగన్‌ డైరెక్షన్‌లోనే ఆటవిక చర్యలు

ABN , Publish Date - Aug 04 , 2026 | 09:10 AM

జగన్‌ డైరెక్షన్‌లోనే వైసీపీ నేతలు ఆటవిక చర్యలకు పాల్పడుతున్నారని మంత్రి కొలుసు పార్థసారథి ఆరోపించారు. సోమవారం టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు.

జగన్‌ డైరెక్షన్‌లోనే ఆటవిక చర్యలు
Kolusu Parthasarathy

  • అలజడులపై ప్రజల ఆగ్రహం

  • ఆ పార్టీని తరిమి కొట్టాలని నిశ్చయించారు

  • తప్పు చేసి తప్పించుకుందామంటే కుదరదు

  • వైసీపీపై మంత్రుల వ్యాఖ్యలు


అమరావతి (ఆంధ్రజ్యోతి): జగన్‌ డైరెక్షన్‌లోనే వైసీపీ నేతలు ఆటవిక చర్యలకు పాల్పడుతున్నారని మంత్రి కొలుసు పార్థసారథి ఆరోపించారు. సోమవారం టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘వైసీపీ పెంచి పోషిస్తున్న అరాచక శక్తులు, రాష్ట్రంలో కలిగిస్తున్న అలజడులపై ప్రజలందరూ తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఆ పార్టీని రాష్ట్రం నుంచి తరిమి కొట్టాలని నిశ్చయించుకున్నారు. ప్రజలకు సేవ చేయాల్సిన రాజకీయ పార్టీ... దాన్ని వదిలేసి అరాచకాలు సృష్టించడం, కులాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టడమే పనిగా పెట్టుకుంది. వైసీపీ నేతలు అడ్డగోలుగా తప్పులు చేయడం... దొరికిపోయాక, సోషల్‌ మీడియాలో రాజకీయ కక్ష సాధింపు అని బురదచల్లడం అలవాటుగా చేసుకున్నారు. సీదిరి అప్పలరాజు కొడుకు చేసిన రోడ్డు ప్రమాదంలో చనిపోయిన గొర్రెల కాపరిని ఉద్దేశించి జగన్‌ చేసిన వ్యాఖ్యలు ఆయన విపరీత మనస్తత్వానికి అద్దం పడుతున్నాయి. కర్నూలు జిల్లాలో వైసీపీ ఎమ్మెల్యే, ఆయన రౌడీమూకలు ఓ దళిత, బలహీనవర్గానికి చెందిన కుటుంబంపై మారణాయుధాలతో దౌర్జన్యం చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నా. వైసీపీ ఎమ్మెల్యేలు ఎంతటి ఘోరాలకు పాల్పడినా జగన్‌ కనీసం ఖండించకపోగా వారిని వెనకేసుకొస్తూ ప్రోత్సహిస్తున్నారు’ అని మంత్రి విమర్శించారు.


వైసీపీ నేతలూ.. నేరాలు చేసి తప్పించుకోలేరు: మంత్రి గుమ్మిడి

‘తప్పు చేసి తప్పించుకుందామంటే కుదరదు. తప్పు చేసిన వారిని మా ప్రభుత్వం తప్పకుండా శిక్షిస్తుంది’ అని మంత్రి గుమ్మిడి సంధ్యారాణి అన్నారు. సోమవారం టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆమె విలేకరులతో మాట్లాడారు. ‘గత ప్రభుత్వంలో స్పీకర్‌గా చేసిన ఆయన చాలా నీతులు చెప్పేవారు. దొంగ రికార్డులు సృష్టించి భూమిని కబ్జా చేయాలని చూడటం ఆయన అసలు రంగు. అలాగే మంత్రిగా చేసిన సీదిరి కూడా కొడుకు చేసిన తప్పును మరొకరికి అంటించాలని చూసి చట్టానికి చిక్కిపోయారు. గొడ్డలి పార్టీ అధినేత పరామర్శకు వస్తున్నాడంటే చనిపోయిన వారి ఇంటికి వస్తున్నారని అనుకున్నాం... కానీ చంపినవాడి పరామర్శకు వెళ్లి తన అసలు రూపాన్ని బయటపెట్టారు. తమ్మినేని, సీదిరి, ముస్తఫా, కారుమూరి.. వీరంతా జగన్‌ పెట్టుకున్న నవరత్నాలు’ అని మంత్రి ఎద్దేవా చేశారు.


ఇవి కూడా చదవండి

హైదరాబాద్‏లోని ఈ ఏరియాల్లో 5న తాగునీటి సరఫరా బంద్

‘ఉక్కు పని’ ఇక వల్లకాదు

Updated Date - Aug 04 , 2026 | 09:10 AM