Share News

పల్లెలను సర్వనాశనం చేసిన ఘనత వైసీపీదే

ABN , Publish Date - Nov 07 , 2026 | 05:06 AM

పల్లెలను సర్వనాశనం చేసిన వైసీపీకి ఓటు అడిగే అర్హత లేదని మాజీ ఎమ్మెల్సీ అశోక్‌బాబు అన్నారు. శుక్రవారం టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు.

పల్లెలను సర్వనాశనం చేసిన ఘనత వైసీపీదే

  • కరోనా విపత్తులో పల్లెల్లో బ్లీచింగ్‌ పౌడర్‌కూ పైసలు లేకుండా చేశారు: అశోక్‌బాబు

అమరావతి, నవంబరు 6(ఆంధ్రజ్యోతి): పల్లెలను సర్వనాశనం చేసిన వైసీపీకి ఓటు అడిగే అర్హత లేదని మాజీ ఎమ్మెల్సీ అశోక్‌బాబు అన్నారు. శుక్రవారం టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘కేంద్రం ఇచ్చిన రూ.కోట్ల పంచాయతీ నిధులను జగన్‌ దారి మళ్లించి పప్పుబెల్లాల్లా వాడేశారు. కరోనా విపత్తులో పల్లెల్లో బ్లీచింగ్‌ పౌడర్‌ చల్లేందుకూ పైసలు లేకుండా చేసిన ఘనత వైసీపీ ప్రభుత్వానిదే. రూ.3 వేల కోట్ల ఉపాధి హామీ నిధులను వైసీపీ కార్యకర్తలు బొక్కేశారు’ అని అన్నారు.

ఈ వార్తలనూ చదవండి:

కౌంటింగ్‌కు వేళాయె...

సీఎం విజయ్‌కు ఫోన్ చేసి అదే చెప్పా: సీఎం చంద్రబాబు

Updated Date - Nov 07 , 2026 | 05:08 AM