Share News

శ్రీకాకుళం కోర్టులో లొంగిపోయిన తమ్మినేని సీతారాం కుమారుడు చిరంజీవి నాగ్..

ABN , Publish Date - Aug 03 , 2026 | 07:50 PM

శ్రీకాకుళం జిల్లా చాపరం భూ కబ్జా కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ మాజీ స్పీకర్, వైసీపీ నేత తమ్మినేని సీతారాం కుమారుడు చిరంజీవి నాగ్ ఇవాళ (సోమవారం) శ్రీకాకుళం కోర్టులో లొంగిపోయారు.

శ్రీకాకుళం కోర్టులో లొంగిపోయిన తమ్మినేని సీతారాం కుమారుడు చిరంజీవి నాగ్..
Chiranjeevi Nag

శ్రీకాకుళం: చాపరం భూ కబ్జా కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ మాజీ స్పీకర్, వైసీపీ నేత తమ్మినేని సీతారాం కుమారుడు చిరంజీవి నాగ్ ఇవాళ (సోమవారం) శ్రీకాకుళం కోర్టులో లొంగిపోయారు. విచారణ సందర్భంగా తన ఆరోగ్య పరిస్థితిని కోర్టు దృష్టికి చిరంజీవి నాగ్‌ తీసుకెళ్లగా.. అనారోగ్య కారణాలను న్యాయస్థానం పరిగణనలోకి తీసుకుని బెయిల్ మంజూరు చేసింది.


అయితే, కేసు విచారణలో భాగంగా ఈ నెల 10వ తేదీన తప్పనిసరిగా హాజరుకావాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. కాగా, చాపరం భూ కబ్జా కేసులో చిరంజీవి నాగ్ ఏ-5 నిందితుడిగా ఉండగా.. మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం ఏ-6, ఆయన భార్య వాణిశ్రీ ఏ-7 నిందితులుగా ఉన్నారు. ఈ కేసులో విచారణ కొనసాగుతుండగా తాజా పరిణామాలు రాజకీయ వర్గాల్లో మరోసారి చర్చనీయాంశం అయ్యాయి. కోర్టు తదుపరి విచారణలో కేసుకు సంబంధించిన మరిన్ని కీలక అంశాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.


ఈ వార్తలు కూడా చదవండి

పల్నాడు అభివృద్ధికి అండగా ఉంటామని ప్రధాని హామీ ఇచ్చారు: ఎంపీ కృష్ణదేవరాయలు..

వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్షి అరెస్టుపై ఏపీ అసెంబ్లీ బులెటిన్ విడుదల..

Updated Date - Aug 03 , 2026 | 07:52 PM