Share News

పల్నాడు అభివృద్ధికి అండగా ఉంటామని ప్రధాని హామీ ఇచ్చారు: ఎంపీ కృష్ణదేవరాయలు..

ABN , Publish Date - Aug 03 , 2026 | 07:33 PM

పల్నాడు జిల్లా అభివృద్ధి, గ్రామీణ ఆర్థిక సాధికారతపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి టీడీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు వివరించారు. ఢిల్లీలోని ప్రధాని అధికారిక నివాసంలో ఆయనను ఎంపీ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పల్నాడు జిల్లా ‘క్రెడిట్ అవుట్‌రీచ్ ప్రోగ్రామ్’ ప్రగతిపై సమగ్ర నివేదికను అందజేశారు.

పల్నాడు అభివృద్ధికి అండగా ఉంటామని ప్రధాని హామీ ఇచ్చారు: ఎంపీ కృష్ణదేవరాయలు..
TDP MP Lavu Sri Krishna Devarayalu

ఢిల్లీ: పల్నాడు జిల్లా అభివృద్ధి, గ్రామీణ ఆర్థిక సాధికారతపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి టీడీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు వివరించారు. ఢిల్లీలోని ప్రధాని అధికారిక నివాసంలో ఆయనను ఎంపీ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పల్నాడు జిల్లా ‘క్రెడిట్ అవుట్‌రీచ్ ప్రోగ్రామ్’ ప్రగతిపై సమగ్ర నివేదికను అందజేశారు. జిల్లాలో ఆర్థిక కార్యకలాపాలను ప్రోత్సహించే లక్ష్యంతో చేపట్టిన కార్యక్రమాల వివరాలను ప్రధానికి ఎంపీ వివరించారు.


పల్నాడు జిల్లాలో 1.03 లక్షల మంది లబ్ధిదారులకు మొత్తం రూ.3,216 కోట్ల మేర రుణాలు పంపిణీ చేసినట్లు మోదీకి కృష్ణదేవరాయలు తెలిపారు. ఇందులో తొలిసారిగా 70 వేల మందికి పైగా లబ్ధిదారులకు రుణ సాయం అందించినట్లు వివరించారు. వ్యవసాయ రంగానికి ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తూ 83,365 మంది రైతులకు రూ.2,286 కోట్ల మేర రుణాలు అందించినట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా రైతులు, చిన్న వ్యాపారులు, స్వయం ఉపాధి వర్గాలకు ఆర్థిక అవకాశాలు పెంచేందుకు జిల్లాలో చేపడుతున్న చర్యలను వివరించారు. పల్నాడు జిల్లాలో గ్రామీణ సాధికారత, ఆర్థిక పురోగతి కోసం అమలు చేస్తున్న కార్యక్రమాలపై ప్రధాని మోదీ అభినందనలు తెలిపినట్లు ఎంపీ తెలిపారు.


‘వికసిత్ భారత్’ లక్ష్య సాధనలో భాగంగా జిల్లా అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం ఉంటుందని ప్రధాని హామీ ఇచ్చినట్లు ఎంపీ కృష్ణదేవరాయలు వెల్లడించారు. జిల్లా ప్రజల ఆర్థికాభివృద్ధికి మరిన్ని అవకాశాలు కల్పించేందుకు కేంద్ర పథకాలను సమర్థవంతంగా వినియోగించుకుంటామని ఆయన పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి

డేటా ఆధారిత పాలనకు ప్రాధాన్యం ఇవ్వాలి: సీఎం చంద్రబాబు

వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్షి అరెస్టుపై ఏపీ అసెంబ్లీ బులెటిన్ విడుదల..

Updated Date - Aug 03 , 2026 | 07:33 PM