వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్షి అరెస్టుపై ఏపీ అసెంబ్లీ బులెటిన్ విడుదల..
ABN , Publish Date - Aug 03 , 2026 | 06:49 PM
కర్నూలు జిల్లా ఆలూరు ఎమ్మెల్యే బుసినే విరూపాక్షి అరెస్టు వ్యవహారంపై ఏపీ శాసనసభ కార్యదర్శి జనరల్ కార్యాలయం బులెటిన్ విడుదల చేసింది. శాసనసభ సభ్యులందరికీ సమాచారం అందిస్తూ జారీ చేసిన ఈ బులెటిన్‌లో ఎమ్మెల్యే అరెస్టుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు.
కర్నూలు జిల్లా: ఆలూరు ఎమ్మెల్యే బుసినే విరూపాక్షి అరెస్టు వ్యవహారంపై ఏపీ శాసనసభ కార్యదర్శి జనరల్ కార్యాలయం బులెటిన్ విడుదల చేసింది. శాసనసభ సభ్యులందరికీ సమాచారం అందిస్తూ జారీ చేసిన ఈ బులెటిన్‌లో ఎమ్మెల్యే అరెస్టుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. బులెటిన్ ప్రకారం.. ఆగస్టు 2వ తేదీ తెల్లవారుజామున 3 గంటలకు కర్నూలు జిల్లా చిప్పగిరిలోని ఎమ్మెల్యే నివాసంలో విరూపాక్షిని పోలీసులు అరెస్టు చేశారు.
ఎమ్మెల్యేను ఆలూరు సర్కిల్ ఇన్‌స్పెక్టర్ అరెస్టు చేసినట్లు బులెటిన్‌లో వెల్లడించారు. చిప్పగిరి పోలీస్ స్టేషన్‌లో నమోదైన క్రైమ్ నంబర్ 37/2026 కేసులో అరెస్టు అయినట్లు పేర్కొన్నారు. ఈ కేసులో భారతీయ న్యాయ సంహిత (బీఎన్‌ఎస్)లోని పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. అలాగే చిప్పగిరి పోలీస్ స్టేషన్‌లోనే నమోదైన మరో క్రైమ్ నంబర్ 38/2026 కేసులోనూ ఎమ్మెల్యే ఏ-1గా ఉన్నట్లు అసెంబ్లీ బులెటిన్‌లో పేర్కొన్నారు. ఈ కేసులో బీఎన్‌ఎస్ సెక్షన్లతో పాటు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కూడా కేసులు నమోదు చేసినట్లు ఎమ్మెల్యేలకు సమాచారం ఇచ్చారు. శాసనసభ్యుడి అరెస్టు జరిగిన నేపథ్యంలో సభా నిబంధనల ప్రకారం సభ్యులందరికీ వివరాలు తెలియజేస్తూ అసెంబ్లీ సెక్రటరీ జనరల్ ఈ బులెటిన్ జారీ చేశారు.
కాగా, శనివారం నాడు చిప్పగిరి మండలం నేమకల్లు, సంగాల గ్రామాలకు చెందిన టీడీపీ కార్యకర్తలపై వందలాది మంది అనుచరులతో ఎమ్మెల్యే విరూపాక్షి దాడి చేశారు. పలువురు టీడీపీ కార్యకర్తల ఇళ్లపైకి వెళ్లి ఆడ, మగ అనే తేడా లేకుండా తీవ్రంగా గాయపరిచారు. దీంతో బాధితుల ఫిర్యాదు మేరకు ఎమ్మెల్యే విరూపాక్షి సహా 34 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. వీరిలో 16 మందిని అరెస్టు చేయగా.. ఆలూరు కోర్టు రిమాండ్ విధించింది.
ఈ వార్తలు కూడా చదవండి
మంత్రి సుభాశ్ చొరవ.. ఆ వ్యాధితో బాధపడుతున్న బాలుడికి శస్త్రచికిత్స
డేటా ఆధారిత పాలనకు ప్రాధాన్యం ఇవ్వాలి: సీఎం చంద్రబాబు