బ్రోకర్లను నమ్మి.. విజిటింగ్ వీసాపై వెళ్లి!
ABN , Publish Date - Sep 12 , 2026 | 05:11 AM
మలేషియాలో ఉద్యోగం.. నెలకు రూ.60వేలు వేతనం ఇస్తారని బ్రోకర్లు చెప్పడంతో 40 మంది నిరుద్యోగులు నెల క్రితం మలేషియా దేశానికి విజిటింగ్ వీసాపై వెళ్లారు. తీరా అక్కడ బ్రోకర్లు వీరిని పనికి కుదిర్చినా పర్మినెంట్ వీసా లేకపోవడంతో..
మలేషియాలో చిక్కుకున్న 40 మంది సిక్కోలు వాసులు
పలాస, సెప్టెంబరు 11(ఆంధ్రజ్యోతి): మలేషియాలో ఉద్యోగం.. నెలకు రూ.60వేలు వేతనం ఇస్తారని బ్రోకర్లు చెప్పడంతో 40 మంది నిరుద్యోగులు నెల క్రితం మలేషియా దేశానికి విజిటింగ్ వీసాపై వెళ్లారు. తీరా అక్కడ బ్రోకర్లు వీరిని పనికి కుదిర్చినా పర్మినెంట్ వీసా లేకపోవడంతో.. మలేషియా ఇమిగ్రేషన్ అధికారులు నలుగురిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. బాధిత యువకులంతా శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు, మందస, కవిటి, ఇచ్ఛాపురం ప్రాంతాలకు చెందినవారు కాగా, తమ బిడ్డలను క్షేమంగా రప్పించాలని కోరుతూ వారి తల్లిదండ్రులు పలాస ఎమ్మెల్యే గౌతు శిరీషకు శుక్రవారం మధ్యాహ్నం కలిసి విజ్ఞప్తి చేశారు. ఆమె వెంటనే కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడు, రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడుకు సమాచారం చేరవేశారు. వారిని రప్పించేందుకు ఏర్పాట్లు చేస్తామని, భయపడవద్దని బాధితులకు ఎమ్మెల్యే భరోసా ఇచ్చారు.
ఈ వార్తలనూ చదవండి...
స్థానిక నాయకత్వం ఆమోదంతోనే చిన్న శ్రీనును పార్టీలోకి తీసుకున్నాం:
ఏపీ 2026-27 ఎక్సైజ్ పాలసీని ప్రకటించిన ఏపీ సర్కార్..