దక్షిణాఫ్రికాలో గాంధీజీకి స్పీకర్ అయ్యన్న నివాళి
ABN , Publish Date - Sep 14 , 2026 | 06:05 AM
శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు దక్షిణాఫ్రికాలోని క్వాజులు-నాటల్ ప్రావిన్స్‌లో ఉన్న చారిత్రక పీటర్ మారిట్జ్‌బర్గ్ రైల్వేస్టేషన్‌ను సందర్శించి జాతిపిత మహాత్మాగాంధీకి ఘనంగా నివాళులర్పించారు.
అమరావతి, సెప్టెంబరు 13(ఆంధ్రజ్యోతి): శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు దక్షిణాఫ్రికాలోని క్వాజులు-నాటల్ ప్రావిన్స్‌లో ఉన్న చారిత్రక పీటర్ మారిట్జ్‌బర్గ్ రైల్వేస్టేషన్‌ను సందర్శించి జాతిపిత మహాత్మాగాంధీకి ఘనంగా నివాళులర్పించారు. ఆదివారం శాసనసభ సెక్రటరీ జనరల్ ప్రసన్న కుమార్ సూర్యదేవరతో కలిసి స్పీకర్ దక్షిణాఫ్రికాలోని చారిత్రక ప్రదేశాల్లో పర్యటించారు. గాంధీ స్మారక కేంద్రాన్ని సందర్శించారు. 1893 జూన్ 7న జాతి వివక్ష కారణంగా బ్రిటిష్ పాలకులు గాంధీజీని ఫస్ట్‌క్లాస్ బోగీ నుంచి బలవంతంగా గెంటేసిన ప్లాట్‌ఫాంను పరిశీలించారు. ఆ రాత్రంతా గడ్డకట్టే చలిలో గాంధీజీ గడిపిన వెయిటింగ్ రూమ్‌ను సందర్శించారు. దక్షిణాఫ్రికాలో గాంధీజీ 21 ఏళ్ల ప్రయాణం, నాటల్ ఇండియన్ కాంగ్రెస్ స్థాపనకు సంబంధించిన ఫొటో గ్యాలరీని వీక్షించారు.
ఈ వార్తలనూ చదవండి..
ప్రజా సమస్యల పరిష్కారానికి చర్యలు: కలిశెట్టి
‘డీఎస్సీపై చర్చకు జగన్ సిద్ధమా?’