Share News

అమ్మ కిడ్నీ ఇస్తోంది

ABN , Publish Date - Sep 14 , 2026 | 04:39 AM

ఒక్క కిడ్నీతోనే జన్మించిన ఆమె.. ఎలాగోలా 15 ఏళ్లు నెట్టుకొచ్చింది. ఇటీవల తీవ్ర అనారోగ్యం పాలై ఆస్పత్రికి వెళితే ఆ కిడ్నీ కూడా పాడైందని తెలిసింది. వెంటనే కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్స చేయాలని, దానికి లక్షల్లో ఖర్చవుతుందని డాక్టర్లు చెప్పడంతో ఆ కుటుంబం నిర్వేదంలో కూరుకుపోయింది.

అమ్మ కిడ్నీ ఇస్తోంది

  • బిడ్డ ఆపరేషన్‌కు సాయం కోరుతోంది..!

  • కిడ్నీ మార్పిడి ఆపరేషన్‌కు రూ.15 లక్షల ఖర్చు

  • దాతల సాయం కోసం తల్లిదండ్రుల వేడుకోలు

కొయ్యలగూడెం, సెప్టెంబరు 13 (ఆంధ్రజ్యోతి): ఒక్క కిడ్నీతోనే జన్మించిన ఆమె.. ఎలాగోలా 15 ఏళ్లు నెట్టుకొచ్చింది. ఇటీవల తీవ్ర అనారోగ్యం పాలై ఆస్పత్రికి వెళితే ఆ కిడ్నీ కూడా పాడైందని తెలిసింది. వెంటనే కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్స చేయాలని, దానికి లక్షల్లో ఖర్చవుతుందని డాక్టర్లు చెప్పడంతో ఆ కుటుంబం నిర్వేదంలో కూరుకుపోయింది. కుమార్తె దీనస్థితి చూసి తల్లడిల్లిపోయిన తల్లి.. తన కిడ్నీ ఇచ్చేందుకు ముందుకొచ్చింది. కానీ.. ఆపరేషన్‌కు డబ్బుల్లేక ఆ కుటుంబం దాతల సాయం కోసం అర్థిస్తోంది. ఏలూరు జిల్లా కొయ్యలగూడెం మండలం సరిపల్లికి చెందిన గణపవరపు రాజేశ్‌కుమార్‌, సీతామహాలక్ష్మి దంపతుల కుమార్తె తనూజశ్రీ సత్య సాయిలక్ష్మి. పదో తరగతిలో 540మార్కులు సాధించిన ఆమె.. డాక్టర్‌ కావాలనే లక్ష్యంతో ఇంటర్‌లో బైపీసీ గ్రూపు తీసుకుని చదువుతోంది. ఒక కిడ్నీతో పుట్టిన ఆమె ఇన్నాళ్లూ ఆరోగ్యంగానే ఉంది. కొన్ని నెలల క్రితం తీవ్ర అనారోగ్యానికి గురికావడంతో తల్లిదండ్రులు పలు ఆస్పత్రుల్లో చూపించారు. విజయవాడలో విజయ సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రి వైద్యులు పరీక్షలన్నీ చేసి ఆమెకు ఉన్న ఒక కిడ్నీ కూడా పాడైందని చెప్పారు. వెంటనే కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్స చేయాలని, రూ.15 లక్షల ఖర్చవుతుందని చెప్పారు.

పోషణే భారం.. 20 లక్షలు ఎలా..?

అసలే పేదరికం. ఇతర ఆస్తిపాస్తులేమీ లేవు. ఇప్పటికే పెద్ద కుమార్తె తనూజ ఆరోగ్యం నిమిత్తం రూ.9లక్షల వరకూ అప్పు చేశారు. ఈ పరిస్థితుల్లో అంత మొత్తం ఎలా సమకూర్చాలో వారికి అర్థం కావడం లేదు. ఈ పరిస్థితుల్లో తనూజకు తన కిడ్నీ ఇవ్వడానికి ఆమె తల్లి సీతామహాలక్ష్మి ముందుకొచ్చింది. వైద్యులు కూడా పరీక్షలు చేసి గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చారు. కానీ... ట్రాన్స్‌ప్లాంటేషన్‌ ఆపరేషన్‌, కిడ్నీ ఇస్తున్న తల్లికి శస్త్రచికిత్స అనంతరం వైద్యచికిత్సలు.. ఇలా సుమారు రూ.20 లక్షలు ఖర్చవుతుందని వారు భయాందోళనకు లోనవుతున్నారు. ఏలూరు ఎంపీ పుట్టా మహేశ్‌ కుమార్‌ దృష్టికి తీసుకెళితే ఆయన సీఎంఆర్‌ఎఫ్‌ నుంచి రూ.3.5 లక్షలకు ఎల్‌వోసీ ఇప్పించారు. మిగతా సొమ్ము కోసం తనూజతోపాటు ఆమె తల్లి సీతామహాలక్ష్మి వేడుకుంటున్నారు. సాయం చేయాలనుకునే దాతలు 96403 45204 ఫోన్‌నంబర్‌ను సంప్రదించవచ్చని తెలిపారు. గణపవరపు రాజేశ్‌కుమార్‌ ఎస్‌బీఐ అకౌంట్‌ నంబరు 3775 407 6944 (ఐఎఫ్‌ఎస్‌సీ కోడ్‌: ఎస్‌బీఐఎన్‌ 0002733)కు డబ్బులు పంపవచ్చని కోరారు.

ఈ వార్తలనూ చదవండి..

ప్రజా సమస్యల పరిష్కారానికి చర్యలు: కలిశెట్టి

‘డీఎస్సీపై చర్చకు జగన్‌ సిద్ధమా?’

Updated Date - Sep 14 , 2026 | 04:39 AM