Share News

పాలకోడేరులో రేవంత్‌ రెడ్డి కుటుంబ సభ్యుల సందడి

ABN , Publish Date - Sep 12 , 2026 | 05:26 AM

సెక్యూరిటీ హడావుడి లేకుండా బంధువులు, మిత్రులతో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కుమార్తె నమీషారెడ్డి, అల్లుడు సత్యనారాయణరెడ్డి, మనుమడు పశ్చిమ గోదావరి జిల్లా పాలకోడేరులో సరదాగా గడిపారు.

పాలకోడేరులో రేవంత్‌ రెడ్డి కుటుంబ సభ్యుల సందడి

పాలకోడేరు, సెప్టెంబరు 11(ఆంధ్రజ్యోతి): సెక్యూరిటీ హడావుడి లేకుండా బంధువులు, మిత్రులతో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కుమార్తె నమీషారెడ్డి, అల్లుడు సత్యనారాయణరెడ్డి, మనుమడు పశ్చిమ గోదావరి జిల్లా పాలకోడేరులో సరదాగా గడిపారు. డెల్టా ప్రాజెక్టు కమిటీ చైర్మన్‌ కునాదరాజు మురళీకృష్ణంరాజు రొయ్యల చెరువుల వద్ద, అదే ప్రాంతంలో కోడిపుంజులతో శుక్రవారం వారంతా సందడి చేశారు. చెరువుల్లో వల వేయడాన్ని ఆసక్తిగా గమనించి వలలో పడ్డ రొయ్యలను చూసి సంబరపడ్డారు. రేవంత్‌రెడ్డి మనవడు కోడిపుంజుల స్థావరంలో గంతులేశాడు. పచ్చని పొలాలను, చెరువుల మధ్య వారు కొంతసేపు ఆనందంగా గడిపారు.

ఈ వార్తలనూ చదవండి...

స్థానిక నాయకత్వం ఆమోదంతోనే చిన్న శ్రీనును పార్టీలోకి తీసుకున్నాం:

ఏపీ 2026-27 ఎక్సైజ్ పాలసీని ప్రకటించిన ఏపీ సర్కార్..

Updated Date - Sep 12 , 2026 | 05:26 AM