రాయలసీమను హార్టికల్చర్ హబ్‌గా తీర్చిదిద్దుతాం: మంత్రి సవిత
ABN , Publish Date - Oct 01 , 2026 | 10:52 AM
రాయలసీమను హార్టికల్చర్‌కు ప్రధాన కేంద్రంగా తీర్చిదిద్దే దిశగా ఏపీ ప్రభుత్వం కీలక చర్యలకు సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా అక్టోబర్ 2న రాష్ట్రంలో లక్ష కోట్ల రూపాయల విలువైన హార్టికల్చర్ పనులకు శ్రీకారం చుట్టనున్నట్లు మంత్రి సవిత తెలిపారు.
శ్రీ సత్యసాయి, అక్టోబర్ 1: రాయలసీమను హార్టికల్చర్‌కు ప్రధాన కేంద్రంగా తీర్చిదిద్దే దిశగా ఏపీ ప్రభుత్వం కీలక చర్యలకు సిద్ధమవుతోంది. శ్రీ సత్యసాయి జిల్లాలోని పెనుకొండలో మంత్రి సవిత మాట్లాడుతూ.. అక్టోబర్ 2న రాష్ట్రంలో లక్ష కోట్ల రూపాయల విలువైన హార్టికల్చర్ పనులకు శ్రీకారం చుట్టనున్నట్లు తెలిపారు. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ చేతుల మీదుగా ఈ పనులను ప్రారంభించనున్నట్లు చెప్పారు.
ఆంధ్రప్రదేశ్‌కు హార్టికల్చర్‌ను పరిచయం చేసిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిదేనని మంత్రి పేర్కొన్నారు. సాగునీటి ప్రాజెక్టుల అభివృద్ధి కోసం రూ.26 వేల కోట్లు కేటాయించినట్లు తెలిపారు. హార్టికల్చర్ నిధులను వినియోగిస్తూ గ్రామీణ ప్రాంతాల్లో రహదారుల అభివృద్ధికి కూడా చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు.
సూపర్ ఎల్‌నినో ప్రభావాన్ని తట్టుకునేలా చేపట్టే ప్రాజెక్టులకు ప్రత్యేకంగా రూ.15 వేల కోట్లు కేటాయించినట్లు మంత్రి సవిత తెలిపారు. హార్టికల్చర్ రంగాన్ని మరింత అభివృద్ధి చేసి రాయలసీమను దేశంలోనే హార్టికల్చర్ హబ్‌గా తీర్చిదిద్దడమే లక్ష్యమన్నారు. రాష్ట్రంలోని 13 జిల్లాలను హార్టికల్చర్ హబ్‌లుగా అభివృద్ధి చేస్తామని తెలిపారు. హార్టికల్చర్ రంగం ద్వారా వ్యవసాయంతో పాటు గ్రామీణ మౌలిక వసతులు కూడా బలోపేతం అయ్యేలా ప్రభుత్వం చర్యలు చేపడుతోందని మంత్రి సవిత పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి...
బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు.. నేటి రేట్స్ ఇవీ
నేడు బాపట్లలో సీఎం పర్యటన.. చంద్రబాబు చేతుల మీదుగా కొత్త పింఛన్ల పంపిణీ
Read Latest AP News And Telugu News