స్థిరంగా బాలిక ఆరోగ్యం
ABN , Publish Date - Nov 04 , 2026 | 05:28 AM
ఉన్మాది హేమంత్ దాడిలో తీవ్రంగా గాయపడిన బాలిక వేగంగా కోలుకుంటోంది. బెంగళూరులోని మణిపాల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆమె ఆరోగ్యం స్థిరంగా ఉంది.
వెంటిలేటర్ నుంచి పీఐసీయూకి మార్పు
ద్రవరూప ఆహారాన్ని తీసుకుంటోందని వైద్యుల వెల్లడి
ఉన్మాది హేమంత్ దాడిలో తీవ్రంగా గాయపడిన బాలిక వేగంగా కోలుకుంటోంది. బెంగళూరులోని మణిపాల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆమె ఆరోగ్యం స్థిరంగా ఉంది. ఈ మేరకు ఆస్పత్రి వైద్యుల బృందం మంగళవారం హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. బాలిక శ్వాసక్రియ మెరుగుపడటంతో వెంటిలేటర్ సపోర్ట్ నుంచి తొలగించారు. ప్రస్తుతం బాధితురాలు పీడియాట్రిక్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో వైద్యుల నిరంతర పర్యవేక్షణలో ఉంది. బాలిక పూర్తిగా స్పృహలోకి వచ్చిందని, ఆడిగిన ప్రశ్నలకు స్పందిస్తూ, సమాధానాలు ఇస్తోందని వైద్యులు తెలిపారు. ద్రవ రూపంలో ఇస్తున్న ఆహారాన్ని ఆమె శరీరం సులభంగా జీర్ణించుకోగలుగుతోందని తెలిపారు. ప్రస్తుతం ఇస్తున్న హైపో ఆక్సిజన్ సపోర్టును క్రమక్రమంగా తగ్గిస్తున్నారు.
శారీరక కదలికలు, ఊపిరితిత్తుల సామర్థ్యాన్ని మెరుగుపరచడం కోసం మంగళవారం నుంచే ఫిజికల్ అండ్ చెస్ట్ ఫిజియోథెరపీ ప్రక్రియలను వైద్య నిపుణులు ప్రారంభించారు. కంటి విభాగం, నాడీ శస్త్రచికిత్స విభాగం నిపుణులు జరిపిన ప్రాథమిక పరీక్షల్లో ఎలాంటి ఆందోళనకరమైన సమస్యలు లేవని తేలింది. ఈ వారంలోనే బాలిక కంటికి సంబంధించిన మరిన్ని లోతైన పరీక్షలు, ఎముకల శస్త్ర చికిత్సలు చేస్తామని వైద్యులు ప్రకటించారు. బాలిక సంపూర్ణంగా కోలుకుని, సాధారణ స్థితికి వచ్చేలా చేయడానికి తాము అత్యుత్తమ, అత్యాధునికమైన వైద్య సంరక్షణను అందిస్తున్నామని మ ణిపాల్ ఆస్పత్రి యాజమాన్యం, వైద్యుల బృందం తెలిపింది.
ఈ వార్తలనూ చదవండి:
కుప్పంలో టీడీపీ జైత్రయాత్ర.. 32 వార్డులూ కైవసం