ఉన్మాది కుడి కాలు తొలగింపు
ABN , Publish Date - Nov 04 , 2026 | 05:10 AM
అనంతపురం జిల్లా రాప్తాడు జడ్పీ ఉన్నత పాఠశాలలో విద్యార్థినులపై ఎలక్ట్రిక్ రంపంతో దాడి చేసిన హేమంత్‌కు వైద్యులు ఒక కాలును తొలగించారు. పోలీసుల కాల్పుల్లో బుల్లెట్లు దూసుకుపోవడంతో కుడి కాలికి తీవ్ర గాయమై, రక్తప్రసరణ ఆగిపోయింది.
రాప్తాడు నిందితుడి రెండో కాలికి కూడా తగ్గిన రక్తప్రసరణ
సమస్య ముదిరితే.. దాన్నీ తీసేయాల్సిందే అంటున్న వైద్యులు
అనంతపురం వైద్యం, నవంబరు 3(ఆంధ్రజ్యోతి): అనంతపురం జిల్లా రాప్తాడు జడ్పీ ఉన్నత పాఠశాలలో విద్యార్థినులపై ఎలక్ట్రిక్ రంపంతో దాడి చేసిన హేమంత్‌కు వైద్యులు ఒక కాలును తొలగించారు. పోలీసుల కాల్పుల్లో బుల్లెట్లు దూసుకుపోవడంతో కుడి కాలికి తీవ్ర గాయమై, రక్తప్రసరణ ఆగిపోయింది. ఈ క్రమంతో గాంగ్రీన్ సోకడంతో సోమవారం అర్ధరాత్రి అనంతపురం ప్రభుత్వాసుపత్రి వైద్యులు ఆపరేషన్ చేశారు. హేమంత్ కుడికాలును పాదం నుంచి తొడ వరకు పూర్తిగా తొలగించారు. రాత్రి ఒంటి గంట నుంచి మంగళవారం తెల్లవారుజామను మూడు గంటలకు వరకు ఆపరేషన్ జరిగింది. అనస్థీషియా ప్రభావం తగ్గి నిందితుడు ఉదయం మెలుకవలోకి వచ్చాడు. ‘బాగుందా?’ అని డాక్టర్లు ప్రశ్నించగా, ఆకలేస్తుందని చెప్పాడు. సర్జరీ అనంతరం 24 గంటల వరకు నోటి ద్వారా ఆహారం ఇవ్వకూడదని డాక్టర్లు తెలిపారు. అతనికి ఐవీ ఫ్లూయిడ్స్ అందిస్తున్నారు. కాస్త కోలుకున్న అనంతరం ఖైదీల వార్డుకు మార్చేందుకు ఏర్పాట్లు చేశారు.
రెండో కాలునూ తీసేస్తారా?
పోలీసుల కాల్పుల్లో హేమంత్ రెండు కాళ్లకు తూటాల గాయాలయ్యాయి. ఎడమ కాలికి కూడా రక్త ప్రసరణ తక్కువగా ఉన్నట్లు వైద్య పరీక్షల్లో తేలింది. అయితే దీని ప్రభావం ఏ మేరకు ఉంటుంది? గ్యాంగ్రీన్ సోకే ప్రమాదం ఉందా లేదా అన్నది వైద్యులు ప్రస్తుతానికి చెప్పలేకున్నారు. రక్త ప్రసరణ శాతం మరింత తగ్గితే ఎడమ కాలిని కూడా తొలగించాల్సి ఉంటుందని అంటున్నారు. తదుపరి వైద్య పరీక్షల అనంతరం దీనిపై స్పష్టత వస్తుందని చెబుతున్నారు.
ఈ వార్తలనూ చదవండి:
కుప్పంలో టీడీపీ జైత్రయాత్ర.. 32 వార్డులూ కైవసం