Share News

రెడ్డిపల్లి జైలుకు రాప్తాడు నిందితుడు

ABN , Publish Date - Nov 19 , 2026 | 01:06 AM

అనంతపురం జిల్లా రాప్తాడు కేసులో నిందితుడు హేమంత్‌ను పోలీసులు బుధవారం అనంతపురం జిల్లా రెడ్డిపల్లి సెంట్రల్‌ జైలుకు తరలించారు.

రెడ్డిపల్లి జైలుకు రాప్తాడు నిందితుడు

  • కర్నూలు జీజీహెచ్‌ నుంచి నేరుగా తరలింపు

అనంతపురం క్రైం, నవంబరు 18(ఆంధ్రజ్యోతి): అనంతపురం జిల్లా రాప్తాడు కేసులో నిందితుడు హేమంత్‌ను పోలీసులు బుధవారం అనంతపురం జిల్లా రెడ్డిపల్లి సెంట్రల్‌ జైలుకు తరలించారు. కర్నూలు జీజీహెచ్‌లో చికిత్స పొందుతున్న నిందితుడిని వైద్యులు బుధవారం డిశ్చార్జి చేశారు. దీంతో పోలీసులు అక్కడి నుంచి ప్రత్యేక అంబులెన్స్‌లో జైలుకు తీసుకొచ్చారు. రిమాండ్‌ ఖైదీగా ఉన్న హేమంత్‌, నడవలేని స్థితిలో ఉండటంతో మధ్యాహ్నం 3 గంటలకు జైలుకు వద్దకు వచ్చిన అంబులెన్స్‌ను జైలు లోపలికి అనుమతించారు.

అనంతరం జైలు ఆవరణలో ఉన్న ఆసుపత్రిలో చేర్చారు. జైలు డాక్టర్ల పర్యవేక్షణలో హేమంత్‌ను అక్కడి వార్డులో ఉంచారు. పోలీసు కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన హేమంత్‌కు అనంతపురం జిల్లా సర్వజన వైద్యశాలలో కుడికాలును తొలగించిన విషయం తెలిసిందే. శ్వాసకోశ సంబంధ సమస్యలు తలెత్తడంతో నిందితుడిని కర్నూలుకు తరలించారు. బీపీ, పల్స్‌ రేట్‌ సాధారణ స్థితికి వచ్చి ఆరోగ్యం నిలకడగా ఉండటంతో వైద్యులు డిశ్చార్జి చేశారు.

ఈ వార్తలనూ చదవండి:

ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై జగన్‌కు లోకేశ్ కౌంటర్

పంజాబ్‌లో లారీ డ్రైవర్‌కు రూ.12 కోట్ల జాక్‌పాట్

Updated Date - Nov 19 , 2026 | 01:06 AM