Share News

రాప్తాడు రంపం దాడి ఉన్మాదిపై కఠిన సెక్షన్లతో కేసులు..

ABN , Publish Date - Nov 03 , 2026 | 08:06 AM

రాప్తాడు రంపం దాడి ఉన్మాది హేమంత్‌పై పోలీసులు పలు కఠిన సెక్షన్లతో కూడిన కేసులు నమోదు చేశారు. దాడిలో బాధితురాలిని కాపాడే ప్రయత్నంలో తీవ్రంగా గాయపడిన లక్ష్మి అనే విద్యార్థి ఫిర్యాదుతో అతడిపై పలు సెక్షన్లు జోడించినట్లు పోలీసులు తెలిపారు.

రాప్తాడు రంపం దాడి ఉన్మాదిపై కఠిన సెక్షన్లతో కేసులు..
Raptadu attack

ఇంటర్నెట్ డెస్క్: రాప్తాడు రంపం దాడి ఉన్మాది హేమంత్‌పై పోలీసులు పలు కఠిన సెక్షన్లతో కూడిన కేసులు నమోదు చేశారు. దాడిలో బాధితురాలిని కాపాడే ప్రయత్నంలో తీవ్రంగా గాయపడిన లక్ష్మి అనే విద్యార్థి ఫిర్యాదుతో అతడిపై పలు సెక్షన్లు జోడించినట్లు పోలీసులు తెలిపారు. నిందితుడు హేమంత్‌పై భారతీయ న్యాయ సంహిత (BNS) సెక్షన్ 109(1) కింద హత్యాయత్నం కేసు నమోదు చేశారు. అలాగే రంపంతో బాలిక ముఖం, వీపు భాగాలపై దాడి చేసి గాయపరిచినందుకు BNS సెక్షన్ 118(1) కింద కేసు పెట్టారు. పాఠశాలలోకి చొరబడి పదునైన ఆయుధంతో దాడికి పాల్పడినందుకు BNS సెక్షన్ 333ను కూడా చేర్చారు.


ఈ ఘటనలో గాయపడిన విద్యార్థిని గోపిక ఫిర్యాదు ఆధారంగా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీస్ చట్టంలోని సెక్షన్ 3(2)(v) కింద కూడా కేసు నమోదు చేశారు. కాగా నిందితుడు హేమంత్‌కు జీవిత ఖైదు పడే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే, రాప్తాడు ఉన్మాది దాడిలో తీవ్రంగా గాయపడిన గోపిక ఆరోగ్యం క్రమంగా మెరుగవుతోంది. బెంగళూరు మణిపాల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. మరోవైపు, పోలీసుల కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన హేమంత్‌ కూడా ఆసుపత్రిలోనే చికిత్స తీసుకుంటున్నాడు. అతడి కాలు తీసేయాల్సిన అవసరం రావొచ్చని ఇప్పటికే వైద్యులు వెల్లడించారు.


ఇవి కూడా చదవండి:

ముక్కోణపు సిరీస్ గెలిచిన ఆనందంలో పాక్.. షాకిచ్చిన ఐసీసీ!

ఐర్లాండ్‌పై నమీబియా చరిత్రాత్మక విజయం..

Updated Date - Nov 03 , 2026 | 08:23 AM