కసిరెడ్డి ఆదేశాలతోనే ఈశ్వర్‌కు ముడుపుల నగదు!
ABN , Publish Date - Nov 07 , 2026 | 04:31 AM
ఆంధ్రప్రదేశ్‌లో మద్యం రవాణా టెండర్ల కుంభకోణం కేసులో కీలక నిందితుడైన రాజ్ కసిరెడ్డి ఆదేశాలతోనే నెలవారీ ముడుపులను మద్యం రవాణా కాంట్రాక్టర్లు, వారి బినామీలు..
కసిరెడ్డి ఆదేశాలతోనే ఈశ్వర్‌కు ముడుపుల నగదు!
వివిధ మార్గాల్లో కీలక కంపెనీలకు సొమ్ము చేరవేత
ఈడీ విచారణలో వెల్లడి.. మద్యం రవాణా స్కాంలో ముగిసిన ఈశ్వర్ కస్టడీ
16 వరకు రిమాండ్ విధించిన ప్రత్యేక కోర్టు
హైదరాబాద్, నవంబరు 6(ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్‌లో మద్యం రవాణా టెండర్ల కుంభకోణం కేసులో కీలక నిందితుడైన రాజ్ కసిరెడ్డి ఆదేశాలతోనే నెలవారీ ముడుపులను మద్యం రవాణా కాంట్రాక్టర్లు, వారి బినామీలు.. ఆయనకు అత్యంత సన్నిహితుడైన తుకేకుల ఈశ్వర్ కిరణ్‌కుమార్‌రెడ్డికి నగదు రూపంలో అందజేసేవారని తేలింది. ఈ మొత్తాలను వివిధ మార్గాల ద్వారా కిరణ్‌కుమార్‌రెడ్డి కొన్ని కీలక కంపెనీలకు చేర్చారని విచారణ సందర్భంగా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ధ్రువీకరించుకున్నట్లు సమాచారం.
సంబంధిత ఆధారాలను కూడా సేకరించినట్లు తెలిసింది. రవాణా టెండర్ల స్కాంలో మరో నిందితుడైన ఈశ్వర్ కిరణ్‌కుమార్‌రెడ్డిని ఈడీ అధికారులు కస్టడీలో రెండ్రోజులు విచారించిన సంగతి తెలిసిందే. కస్టడీ గడువు ముగియడంతో శుక్రవారం ఆయన్ను నాంపల్లి ప్రత్యేక కోర్టు ముందు హాజరుపరిచారు. ఈ నెల 16వ తేదీ వరకు ఆయనకు జ్యుడీషియల్ రిమాండ్ విధిస్తూ న్యాయాధికారి ఉత్తర్వులు జారీచేశారు.
ఈ వార్తలనూ చదవండి:
సీఎం విజయ్‌కు ఫోన్ చేసి అదే చెప్పా: సీఎం చంద్రబాబు