Share News

ఈ ప్రశ్నలకు బదులేదీ?

ABN , Publish Date - Oct 24 , 2026 | 04:51 AM

నాడు ప్రతిపక్షనేతగా, ముఖ్యమంత్రిగా రాజశేఖరరెడ్డి ఉన్నప్పుడు ప్రాణాపాయం ఉందని తెలిసినా కుటుంబంలో అందరి పెళ్లిళ్లూ ఇంట్లో చేయలేదా? శత్రువులకు సైతం ఆ పెళ్లిళ్లకు ఆహ్వానాలు పంపలేదా?

ఈ ప్రశ్నలకు బదులేదీ?

జగన్‌కు షర్మిల సన్నిహితులు సంధిస్తున్న ప్రశ్నలివి..

  • నాడు ప్రతిపక్షనేతగా, ముఖ్యమంత్రిగా రాజశేఖరరెడ్డి ఉన్నప్పుడు ప్రాణాపాయం ఉందని తెలిసినా కుటుంబంలో అందరి పెళ్లిళ్లూ ఇంట్లో చేయలేదా? శత్రువులకు సైతం ఆ పెళ్లిళ్లకు ఆహ్వానాలు పంపలేదా?

  • వైఎస్‌ తమ్ముళ్ల పిల్లలు, తోడపుట్టిన చెల్లెలు విమలమ్మ పిల్లల పెళ్లిళ్లు వైఎస్‌ ఇంట్లో జరగలేదా?

  • ఇంట్లో మేనకోడలి పెళ్లి చేయడం వల్ల ప్రాణహాని ఉందని భయపడితే బెంగళూరు భవంతికి వెళ్లకుండా 10 రోజులు ఎటైనా వెళ్లొచ్చు కదా?

  • యలహంకలో ఇరువురి భవనాల చుట్టూ కాంపౌండ్‌ వేర్వేరుగా ఉన్నట్టు గూగుల్‌ మ్యాప్‌లో చూస్తే ఎవరికైనా అర్థం అవుతుంది.

  • షర్మిలకు కాబోయే వియ్యంకులు ఇప్పటికే వెడ్డింగ్‌ కార్డులో షర్మిల రెసిడెన్సీ, బెంగళూరులో వివాహం అని కార్డులు ముద్రించి పంచారు. సెక్యూరిటీ పేరుతో వివాహ వేడుకకు అభ్యంతరం చెప్పి కాబోయే వియ్యంకుల ముందు షర్మిల పరువు తీయాలని చూడటం

ఎంతవరకు సమంజసం?

  • పెళ్లికి రావడం ఇష్టం లేక సెక్యూరిటీ పేరుతో, భవనం నీది కాదు అనే పేరుతో ఈ దొంగ డ్రామాలు ఎందుకు?

  • పక్కనే ఉండి పెళ్లికి రాలేదనే ముద్రను కప్పిపుచ్చుకోవడానికే కదా మేనకోడలి పెళ్లిపై కుట్రలు?

  • నీకు నచ్చకపోతే ఏ దేశం అయినా వెళ్లిపోవచ్చు కదా..! ప్రాణహాని ఉందని కుళ్లు, కుతంత్రాలతో కుట్రలు చేయడం ఏమిటి?

ఈ వార్తలనూ చదవండి:

పల్లె పండుగకు నిధుల గండం

ఇంటర్‌ పరీక్షల షెడ్యూల్‌ విడుదల

Updated Date - Oct 24 , 2026 | 04:53 AM