Share News

వెలిగొండ నీటి ప్రవాహంలో చిక్కుకున్న యువకులు.. రక్షించిన రెస్క్యూ టీం

ABN , Publish Date - Sep 01 , 2026 | 06:57 AM

వెలిగొండ నుంచి వస్తున్న కృష్ణా జలాలు చూసేందుకు ముంపు గ్రామం కలనూతల వెళ్లి ఆ నీటి ప్రవాహంలో యువకులు చిక్కుకుపోయారు. వారిని జిల్లా అధికారులు రక్షించారు.

 వెలిగొండ నీటి ప్రవాహంలో చిక్కుకున్న యువకులు.. రక్షించిన రెస్క్యూ టీం

మార్కాపురం,సెప్టెంబర్01: జిల్లాలోని పెద్దారవీడు మండలం కలనూతల సమీపంలోని వెలిగొండ నీటి ప్రవాహంలో కారు కొట్టుకుపోయింది. కారులోని ముగ్గురు యువకులు సమీపంలోని చెట్టు ఎక్కి రక్షించాలంటూ బిగ్గరగా కేకలు వేశారు. ఈ విషయాన్ని గమనించిన స్థానికులు.. వెంటనే జిల్లా అధికారులతోపాటు పోలీసులకు సమాచారం అందించారు. జిల్లా కలెక్టర్ విజయ సునీత ఆధ్వర్యంలో దాదాపు ఏడు గంటల పాటు శ్రమించి.. ఆ యువకులను రెస్క్యూ టీం కాపాడింది.


వెలిగొండ నుంచి వస్తున్న కృష్ణా జలాలు చూసేందుకు ముంపు గ్రామం కలనూతల వెళ్లి.. ఈ నీటి ప్రవాహంలో చిక్కుకున్నట్లు ఆ యువకులు వెల్లడించారు. వెలిగొండ ప్రాజెక్టును సోమవారం సీఎం చంద్రబాబు ప్రారంభించిన విషయం విదితమే.

Updated Date - Sep 01 , 2026 | 07:05 AM