రావణ్ ఖాతాల్లో విదేశీ నిధులు!
ABN , Publish Date - Sep 25 , 2026 | 04:40 AM
యూట్యూబర్ బచ్చలకూరి జోసెఫ్ (ప్రశ్న రావణ్) బ్యాంకు ఖాతాలకు విదేశాల నుంచి నిధులు వచ్చినట్లు దర్యాప్తు అధికారులు గుర్తించారు. ఆ నిధులకు సంబంధించి లావాదేవీలు కూడా ఎక్కువగా జరిగినట్లు వారి దృష్టికి వచ్చిం ది. వాటిపై త్వరలోనే విచారణ చేసేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారని తెలిసింది.
గుర్తించిన పోలీసు అధికారులు..
ముగిసిన జోసెఫ్ పోలీస్ కస్టడీ..
గన్నవరం, సెప్టెంబరు 24(ఆంధ్రజ్యోతి): యూట్యూబర్ బచ్చలకూరి జోసెఫ్ (ప్రశ్న రావణ్) బ్యాంకు ఖాతాలకు విదేశాల నుంచి నిధులు వచ్చినట్లు దర్యాప్తు అధికారులు గుర్తించారు. ఆ నిధులకు సంబంధించి లావాదేవీలు కూడా ఎక్కువగా జరిగినట్లు వారి దృష్టికి వచ్చిం ది. వాటిపై త్వరలోనే విచారణ చేసేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారని తెలిసింది. రాజకీయ పార్టీలతో రావణ్‌కు ఉన్న సంబంధాలు, ఆర్థికంగా మద్దతుగా నిలుస్తున్న వ్యక్తుల సమాచారం సేకరించేందుకు పోలీసులు ప్రయత్నించినట్లు సమాచారం. కాగా, రావణ్ పోలీస్ కస్టడీ గురువారం ముగిసింది. కోర్టు అనుమతితో వారం రోజులుగా గన్నవరం సబ్ డివిజన్ కార్యాలయంలో డీఎస్పీ కె.ధర్మేంద్ర, సీఐ బీవీ శివప్రసాద్ నేతృత్వంలో రావణ్‌ను విచారించారు. విచారణలో ఆయన దాటవేసే సమాధానాలు చెప్పినట్టు తెలిసింది. అధికారులు అడిగిన ప్రశ్నలకు మాటలు మారుస్తూ సరైన జవాబులు ఇవ్వలేదని సమాచారం. విచారణ అనంతరం గన్నవరం ఆస్పత్రిలో రావణ్‌కు వైద్య పరీక్షలు నిర్వహించారు. విజయవాడలోని 2వ అదనపు జూనియర్ సివిల్ కోర్టులో హాజరుపరిచి తిరిగి నెల్లూరు జైలుకు తరలించారు.
ఈ వార్తలనూ చదవండి...