అమరావతిలో పీఎన్‌బీ క్వాంటం హబ్.. బ్యాంకింగ్ రంగంలో కొత్త శకం
ABN , Publish Date - Jul 23 , 2026 | 08:24 PM
భవిష్యత్ బ్యాంకింగ్‌కు క్వాంటం టెక్నాలజీని జోడించే దిశగా అమరావతి మరో కీలక మైలురాయిని చేరుకుంది. పీఎన్‌బీతో రాష్ట్ర ప్రభుత్వం క్వాంటం ఫైనాన్స్ ఇన్నోవేషన్ హబ్ ఏర్పాటుకు ఒప్పందం కుదుర్చుకుంది..
అమరావతి, జులై 23: భవిష్యత్ బ్యాంకింగ్‌కు క్వాంటం టెక్నాలజీని జోడించే దిశగా అమరావతి మరో కీలక మైలురాయిని చేరుకుంది. పీఎన్‌బీతో రాష్ట్ర ప్రభుత్వం క్వాంటం ఫైనాన్స్ ఇన్నోవేషన్ హబ్ ఏర్పాటుకు ఒప్పందం కుదుర్చుకుంది. అమరావతి క్వాంటం వ్యాలీలో మరో ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టు ఏర్పాటు కానుంది. బ్యాంకింగ్ రంగంలో అత్యాధునిక సాంకేతికతను అందుబాటులోకి తీసుకురావాలనే లక్ష్యంతో పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB) అమరావతిలో క్వాంటం ఫైనాన్స్ ఇన్నోవేషన్ హబ్ ఏర్పాటు చేయడానికి ముందుకొచ్చింది. ఇందుకు సంబంధించి ఏపీ క్వాంటం మిషన్, పంజాబ్ నేషనల్ బ్యాంక్ మధ్య అవగాహన ఒప్పందం (MoU) కుదిరింది.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో పీఎన్‌బీ సీఈఓ, ఎండీ అశోక్ చంద్రతో కలిసి ఈ ఒప్పందంపై సంతకాలు జరిగాయి. అమరావతి క్వాంటం కంప్యూటింగ్ సెంటర్‌లో ఏర్పాటు కానున్న ఈ ఇన్నోవేషన్ హబ్ ద్వారా బ్యాంకింగ్ రంగంలో క్వాంటం కంప్యూటింగ్ ఆధారిత పరిశోధనలు, సాంకేతిక పరిష్కారాల అభివృద్ధికి ప్రోత్సాహం లభించనుంది. దేశంలో బ్యాంకింగ్ రంగం కోసం ప్రత్యేకంగా క్వాంటం ఫైనాన్స్ ఇన్నోవేషన్ హబ్ ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్న తొలి బ్యాంక్‌గా పంజాబ్ నేషనల్ బ్యాంక్ నిలిచింది. ఈ ప్రాజెక్టుతో అమరావతి క్వాంటం వ్యాలీ ప్రతిష్ఠ మరింత పెరగడంతో పాటు, ఆంధ్రప్రదేశ్‌ను క్వాంటం టెక్నాలజీ, ఫిన్‌టెక్ రంగాల్లో అగ్రగామిగా నిలబెట్టేందుకు ఇది కీలకంగా మారనుంది.
ఈ వార్తలు కూడా చదవండి..
యూపీఏ హయాంలో పేపర్లు లీక్.. కాంగ్రెస్ నేతలు ఎందుకు రాజీనామా చేయలేదు: కిషన్ రెడ్డి
ఉద్యమకారులను సాధ్యమైనంత త్వరగా గుర్తించి.. ప్రభుత్వానికి నివేదిక అందజేస్తాం: కేకే
For More AP News And Telugu News