తుఫాన్ సహాయక చర్యల్లో బాగా పనిచేశారు
ABN , Publish Date - Nov 05 , 2026 | 05:49 AM
వరుస తుఫాన్లను ఎదుర్కొని, సహాయక చర్యల్లో రాష్ట్ర ప్రభుత్వం బాగా పని చేసిందని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు.
సీఎం చంద్రబాబుకు ప్రధాని మోదీ ప్రశంస
అర్నబ్, మురసు తుఫాన్ల ప్రభావంపై ఫోన్‌లో ఆరా
రాష్ట్రాన్ని కేంద్రం ఆదుకోవాలని సీఎం విజ్ఞప్తి
వరుస తుఫాన్లను ఎదుర్కొని, సహాయక చర్యల్లో రాష్ట్ర ప్రభుత్వం బాగా పని చేసిందని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. నిరంతర అప్రమత్తతతో తుఫాన్ వల్ల వచ్చిన ఇబ్బందులను సమర్థంగా అధిగమించారంటూ సీఎం చంద్రబాబును ప్రధాని ప్రశంసించారు. బుధవారం ఉదయం సీఎం చంద్రబాబుకు మోదీ ఫోన్ చేశారు. ఆయా ప్రాంతాల్లో జరిగిన నష్టాన్ని సీఎం.. ప్రధానికి వివరించారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి తగిన సాయం అందించాలని విజ్ఞప్తి చేశారు.
ఈ వార్తలనూ చదవండి:
ఎన్నికల కమిషనర్లకు జీవితకాల చట్టపరమైన రక్షణ.. సుప్రీంకోర్టులో పిటిషన్
ఫోర్జరీ, చీటింగ్ కేసులో సులోచన సహా ముగ్గురికి రిమాండ్