Share News

నేడు అన్నదాత-పీఎం కిసాన్‌ నిధుల విడుదల

ABN , Publish Date - Oct 30 , 2026 | 04:14 AM

దేశవ్యాప్తంగా పీఎం కిసాన్‌, రాష్ట్రంలో అన్నదాత సుఖీభవ-పీఎం కిసాన్‌ రెండో విడత నిధులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు శుక్రవారం విడుదల చేయనున్నాయి.

నేడు అన్నదాత-పీఎం కిసాన్‌ నిధుల విడుదల

  • రైతుల ఖాతాల్లో కేంద్రం 2 వేలు, రాష్ట్రం రూ.5 వేలు జమ

అమరావతి, అక్టోబరు 29(ఆంధ్రజ్యోతి): దేశవ్యాప్తంగా పీఎం కిసాన్‌, రాష్ట్రంలో అన్నదాత సుఖీభవ-పీఎం కిసాన్‌ రెండో విడత నిధులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు శుక్రవారం విడుదల చేయనున్నాయి. గుజరాత్‌లోని బనష్కాంతాలో జరిగే కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ పీఎం కిసాన్‌ నిధులను విడుదల చేయనున్నారు. రాష్ట్రంలో అన్నదాత సుభీభవ-పీఎం కిసాన్‌ నిధులను ప్రభుత్వం నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేయనుంది. రాష్ట్రంలో 46,85,838 మంది రైతు కుటుంబాలకు అన్నదాత సుఖీభవ-పీఎం కిసాన్‌ రెండో విడత కింద రూ.3,125.47 కోట్లు చెల్లించనున్నారు. ఇందులో పీఎం కిసాన్‌ కింద ఒక్కో లబ్ధిదారుకు రూ.2వేలు చొప్పున రూ.782.55కోట్లు, అన్నదాత సుఖీభవ కింద ఒక్కో రైతు కుటుంబానికి రూ.5వేలు చొప్పున రూ.2,342.92 కోట్లు జమ కానున్నాయి.

అన్నదాత సుఖీభవ కింద రాష్ట్రంలోని రైతుల ఖాతాల్లో శుక్రవారం నిధులు జమ చేస్తున్నామని సీఎం చంద్రబాబు క్యాబినెట్‌లో వెల్లడించారు. పీఎం కిసాన్‌ నిధులను కేంద్రం శుక్రవారం విడుదల చేస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభవ నిధులను కూడా శుక్రవారమే విడుదల చేయాలని నిర్ణయించింది. రబీ రైతుల కోసం అనుకున్న సమయం కంటే ముందుగా పీఎం కిసాన్‌ నిధులు విడుదల చేయాలని కేంద్రం నిర్ణయం తీసుకుందని, రాష్ట్ర ప్రభుత్వం కూడా కేంద్రంతోపాటు నిధులు విడుదల చేస్తున్నందున శుక్రవారమే నిధులు విడుదల చేస్తున్నామని సీఎం తెలిపారు. కాగా, స్థానిక సంస్థల ఎన్నికల కోడ్‌(ప్రవర్తన నియమావళి) అమలులో ఉన్నందున ఓటర్లను ప్రభావితం చేయకుండా, రాజకీయ ప్రమేయం లేకుండా రాష్ట్రంలో ఈ కార్యక్రమాన్ని అధికారులు నిర్వహించనున్నట్లు వ్యవసాయశాఖ డైరెక్టర్‌ మనజీర్‌ జిలానీ తెలిపారు.

ఈ వార్తలనూ చదవండి:

తుఫాన్ సహాయక పర్యవేక్షణకు త్వరలో ఎస్ఓపీ విధానం తెస్తాం: సీఎం చంద్రబాబు

ఆర్నబ్ తుఫాన్ వేళ.. ఏపీకి తెలంగాణ అండ.. విద్యుత్ పునరుద్ధరణకు ప్రత్యేక బృందాలు

Updated Date - Oct 30 , 2026 | 04:14 AM