పెట్రోలు కొట్టించుకుని.. నగదు ఇవ్వకుండా పరారీ
ABN , Publish Date - Nov 29 , 2026 | 04:38 AM
కారుకు పెట్రోల్ కొట్టించుకుని నగదు ఇవ్వకుండా పరారవుతున్న వ్యక్తులను వెంబడించే క్రమంలో ఓ బంకులో పనిచేసే ఉద్యోగికి తీవ్రగాయాలయ్యాయి.
నిందితులను వెంబడించిన బంకు ఉద్యోగి
జారిపడి తలకు గాయాలు.. పరిస్థితి విషమం
చీరాల, నవంబరు 28 (ఆంధ్రజ్యోతి): కారుకు పెట్రోల్ కొట్టించుకుని నగదు ఇవ్వకుండా పరారవుతున్న వ్యక్తులను వెంబడించే క్రమంలో ఓ బంకులో పనిచేసే ఉద్యోగికి తీవ్రగాయాలయ్యాయి. బాపట్ల జిల్లా చీరాలలో జాతీయ రహదారి పక్కనున్న ఓ పెట్రోల్ బంకు వద్దకు శనివారం తెల్లవారుజామున గుర్తుతెలియని వ్యక్తులు కారులో వచ్చా రు. రూ.4వేలకుపైగా ఆయిల్ కొట్టించారు. నగదు ఫోన్‌పే చేస్తామని చెప్పారు. బంకులో పనిచేస్తున్న చింతా సాగర్ స్కానర్ చూపుతుండగా కారును వేగంగా పోనిచ్చారు. వెంబడించిన సాగర్ కొంతదూరం పరిగెత్తాక కింద పడిపోయాడు. తలవెనుక బలమైన గాయం కావడంతో అపస్మారకస్థితిలోకి వెళ్లాడు. పరిస్థితి విషమంగా ఉండటంతో బంకు నిర్వాహకులు మెరుగైన వైద్యం కోసం మంగళగిరికి తరలించారు.
ఈ వార్తలనూ చదవండి:
అమరావతి నిర్మాణాలపై వైసీపీ తప్పుడు ప్రచారం.. నిజాలు తేల్చిన ఏపీ ఫ్యాక్ట్ చెక్..