ప్రజల సంతృప్తే అసలైన ప్రోగ్రెస్ రిపోర్ట్: సీఎం చంద్రబాబు
ABN , Publish Date - May 07 , 2026 | 08:17 PM
ప్రభుత్వ యంత్రాంగం పనితీరుపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టమైన లక్ష్యాలను నిర్దేశించారు. అమరావతిలో కలెక్టర్ల కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ పాలనలో సమూల మార్పులు రావాలని ఆకాంక్షించారు.
అమరావతి, మే 07: ప్రభుత్వ యంత్రాంగం పనితీరుపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టమైన లక్ష్యాలను నిర్దేశించారు. అమరావతిలో కలెక్టర్ల కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ పాలనలో సమూల మార్పులు రావాలని ఆకాంక్షించారు. ప్రభుత్వ సేవలు కేవలం గణాంకాలకు పరిమితం కాకుండా.. క్షేత్రస్థాయిలో ప్రజలకు చేరినప్పుడే నిజమైన అభివృద్ధి సాధ్యమవుతుందని స్పష్టం చేశారు.
ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. ‘ప్రజల్లో 90 శాతం సంతృప్తి సాధించడం అనేది కేవలం ఒక లక్ష్యం మాత్రమే కాదు.. అధికారుల తప్పనిసరి బాధ్యత. కేవలం కాగితాల మీద నివేదికలు ఇవ్వడం వల్ల ప్రయోజనం ఉండదు. ప్రజల ముఖాల్లో కనిపించే సంతోషమే అధికారుల అసలైన 'ప్రోగ్రెస్ రిపోర్ట్'. ప్రభుత్వ యంత్రాంగం ఇచ్చే నివేదికల కంటే.. అవి ఇచ్చే ఫలితాలే ప్రాధాన్యత కలిగి ఉండాలి. ప్రతి చిన్న ఫిర్యాదునూ పరిష్కరించడం వల్ల ప్రభుత్వంపై సామాన్యుడికి ఉండే విశ్వాసం పెరుగుతుంది. మనం వ్యవస్థను కేవలం నడపడానికి కాదు.. పూర్తిగా మార్చడానికి ఉన్నాం. కార్యాలయంలో కూర్చుంటే కేవలం గణాంకాలు మాత్రమే కనిపిస్తాయని, క్షేత్రస్థాయిలోకి వెళ్లినప్పుడే అసలైన వాస్తవాలు, సమస్యలు తెలుస్తాయి. పాలనలో వేగం అనేది కేవలం నినాదం మాత్రమే కాదని, రాష్ట్ర అభివృద్ధి వేగాన్ని నిర్ణయించేది పాలన’ అని అన్నారు.
కడప స్టీల్ ప్లాంట్ కల సాకారం..
రాయలసీమ ముఖచిత్రాన్ని మార్చే కీలక ప్రాజెక్టుగా భావిస్తున్న కడప స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీలక ప్రకటన చేశారు. ఈ ప్రతిష్టాత్మక స్టీల్ ప్లాంట్ నిర్మాణ పనులను ఈ నెలలోనే అధికారికంగా ప్రారంభించనున్నట్లు ఆయన స్పష్టం చేశారు. చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న ఈ ప్రాజెక్టును త్వరితగతిన పట్టాలెక్కించి, రాయలసీమ అభివృద్ధికి బాటలు వేయాలని ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉన్నట్లు ముఖ్యమంత్రి వెల్లడించారు. 2028 నాటికి ప్రాజెక్టును పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ ప్రాజెక్టు ద్వారా వేలాది మంది స్థానిక యువతకు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి అవకాశాలు లభిస్తాయని.. ఇది జిల్లా ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
డ్రగ్స్ కట్టడి చేయడమే తొలి ప్రాధాన్యం: డీజీపీ సీవీ ఆనంద్
హైదరాబాద్‌లో బెంగాల్ నటికి వేధింపులు.. నిందితుడికి 7 రోజుల జైలు శిక్ష
Read Latest AP News And Telugu News