త్రిప్రయార్ శ్రీరామ స్వామిని దర్శించుకున్న పవన్
ABN , Publish Date - Sep 12 , 2026 | 04:18 AM
సుప్రసిద్ధ శ్రీరామ క్షేత్రం, నాలాంబలం యాత్రలో విఖ్యాతిగాంచిన క్షేత్రాల్లో ఒకటిగా పేరు పొందిన కేరళం రాష్ట్రంలోని త్రిప్రయార్ శ్రీ రామస్వామిని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ దర్శించుకున్నారు.
అమరావతి, సెప్టెంబరు 11(ఆంధ్రజ్యోతి): సుప్రసిద్ధ శ్రీరామ క్షేత్రం, నాలాంబలం యాత్రలో విఖ్యాతిగాంచిన క్షేత్రాల్లో ఒకటిగా పేరు పొందిన కేరళం రాష్ట్రంలోని త్రిప్రయార్ శ్రీ రామస్వామిని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ దర్శించుకున్నారు. శుక్రవారం సాయంత్రం దీపారాధన సేవలో పాల్గొన్నారు. ఒక్క రోజు దీపారాధన సేవకు విరాళం అందించి, స్వయంగా దీపాలు వెలిగించి సేవలో పాల్గొన్నారు. ఆలయం ప్రధాన ద్వారం ఎదురుగా శ్రీకృష్ణ మందిరంలో ఏర్పాటు చేసిన ప్రధాన దీపాల్లో జ్యోతి ప్రజ్వలన చేశారు. ఆలయ సంప్రదాయాలను అనుసరించి మీనుట్టు, వేదివజిపాడు సేవల్లోనూ పాల్గొన్నారు. ఈ ఆలయానికి సమీపంలో ఆయుర్వేద వైద్యం చేయించుకుంటున్న ఆయన శుక్రవారం స్వామి సేవలో పాల్గొన్నారు.
ఈ వార్తలనూ చదవండి...
స్థానిక నాయకత్వం ఆమోదంతోనే చిన్న శ్రీనును పార్టీలోకి తీసుకున్నాం:
ఏపీ 2026-27 ఎక్సైజ్ పాలసీని ప్రకటించిన ఏపీ సర్కార్..