Share News

పురాధీశులు కొలువుదీరేది నేడే

ABN , Publish Date - Nov 23 , 2026 | 03:50 AM

రాష్ట్రంలో ఇటీవల నిర్వహించిన 100 పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎన్నికైన మేయర్లు, చైర్‌పర్సన్లు సోమవారం కొలువుతీరనున్నారు.

పురాధీశులు కొలువుదీరేది నేడే
chair

  • కొత్త మేయర్లు,చైర్మన్లు కొలువుదీరేది నేడే

  • వార్డు సభ్యుల ప్రమాణ స్వీకారాలు కూడా..

  • డిప్యూటీ మేయర్లు, వైస్‌చైర్‌పర్సన్ల ఎన్నికా నేడే

  • ఏర్పాట్లు చేయాలని కమిషనర్లకు ఎస్‌ఈసీ ఆదేశం

అమరావతి, నవంబరు 22(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ఇటీవల నిర్వహించిన 100 పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎన్నికైన మేయర్లు, చైర్‌పర్సన్లు సోమవారం కొలువుతీరనున్నారు. వారితోపాటు డివిజన్లు/వార్డుల సభ్యుల తొలి సమావేశం సోమవారం జరుగనుంది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఇప్పటికే నోటిఫికేషన్‌ జారీచేసింది. ఆంధ్రప్రదేశ్‌ మున్సిపల్‌ కార్పొరేషన్ల చట్టం-1994లోని సెక్షన్‌(1)(ఏ), ఆంధ్రప్రదేశ్‌ మున్సిపాలిటీల చట్టం-1965లోని సెక్షన్‌ 20(1)(ఏ) ప్రకారం.. ఎన్నికైన సభ్యుల పదవీకాలం తొలి సమావేశపు తేదీ నుంచి ఐదేళ్లపాటు ఉంటుంది. ఈ నిబంధనల ప్రకారం.. 23 తొలి సమావేశాల తేదీగా నిర్ణయించారు. 13 నగరాలు.. విజయనగరం, విశాఖపట్నం, విజయవాడ, ఏలూరు, మచిలీపట్నం, గుంటూరు,ఒంగోలు, నెల్లూరు, కర్నూలు, అనంతపురం, కడప, చిత్తూరు, తిరుపతి కార్పొరేషన్లతోపాటు 87 మున్సిపాలిటీ/నగర పంచాయతీల తొలి సమావేశాల్లో కొత్తగా ఎన్నికైన మేయర్లు, చైర్‌పర్సన్లు, వార్డు సభ్యులతో చట్ట నిబంధనల ప్రకారం ప్రమాణ స్వీకారం చేయిస్తారు. అనంతరం కార్పొరేషన్లలో డిప్యూటీ మేయర్లు, మున్సిపాలిటీ/నగర పంచాయతీల్లో వైస్‌చైర్‌పర్సన్ల ఎన్నికల ప్రక్రియ జరుగుతుంది. చట్ట నిబంధనల ప్రకారం డిప్యూటీ మేయర్‌, వైస్‌చైర్‌పర్సన్‌ ఎన్నికలను తొలి సమావేశంలో లేదా మొదటి సమావేశం జరిగిన తేదీ నుంచి 2వారాల్లోపు నిర్వహించే తదుపరి భేటీలో నిర్వహించవచ్చు. తొలి సమావేశాల నిర్వహణ, వార్డు సభ్యుల ప్రమాణ స్వీకారం, డిప్యూటీ మేయర్లు, వైస్‌చైర్‌పర్సన్ల ఎన్నికలకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని మున్సిపల్‌ కమిషనర్లను ఎస్‌ఈసీ ఆదేశించింది.

ఈ వార్తలు కూడా చదవండి...

ఇండియన్ రోడ్ నెట్‌వర్క్‌ ప్రపంచంలోనే నంబర్‌వన్‌: నితిన్‌ గడ్కరీ

బీఆర్ఎస్ నేతలను అకారణంగా అరెస్ట్ చేస్తున్నారు.. సీఎం రేవంత్‌పై హరీశ్‌రావు ధ్వజం

Updated Date - Nov 23 , 2026 | 05:49 AM