జువ్వలదిన్నె హార్బర్ పనులపై విచారణకు సిద్ధమా.. జగన్‌కు ఎమ్మెల్సీ సవాల్
ABN , Publish Date - Apr 16 , 2026 | 03:30 PM
తల్లి, చెల్లి శీలాన్ని సొంత సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేయించిన దుర్మార్గుడు జగన్ అని ఎమ్మెల్సీ బీద రవిచంద్ర విమర్శలు గుప్పించారు. జగన్ సంస్కారం గురించి మాట్లాడి తమ స్థాయిని దిగజార్చుకోలేమని అన్నారు.
నెల్లూరు, ఏప్రిల్ 16: సాగర్ డిఫెన్స్ అకాడమీపై వైసీపీ అపోహలు సృష్టిస్తోందని ఎమ్మెల్సీ బీదా రవిచంద్ర(MLC Beeda Ravichandra) ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. జగన్ చూపించిన కాల్ డేటాలో ఏమి లేదని.. సంక్రాంతి, జనవరికి కాల్స్ మాట్లాడితే తప్పా అని ప్రశ్నించారు. ఇస్కపల్లి పల్లిపాలెంలో వైసీపీ బెట్టింగ్‌లకు పాల్పడుతుంటే.. పోలీసుల విజ్ఞప్తి మేరకు పెద్ద కాపు తోటయ్యతో బీఎంఆర్ మాట్లాడినట్లు తెలిపారు. గ్రామాల్లో బెట్టింగ్ వల్ల గొడవలు జరగకూడదని మాట్లాడితే తప్పా అని నిలదీశారు.
మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డిని చంపిన తర్వాత జగన్ భార్యకు తొలి కాల్ వచ్చిందని.. అలాంటి కాల్స్ తాము మాట్లాడలేదని స్పష్టం చేశారు. తల్లి, చెల్లి శీలాన్ని సొంత సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేయించిన దుర్మార్గుడు జగన్ అని మండిపడ్డారు. జగన్ సంస్కారం గురించి మాట్లాడి తమ స్థాయిని దిగజార్చుకోలేమని అన్నారు. ఫిషింగ్ హార్బర్ కాంట్రాక్టర్ వైసీపీ ఎంపీ మేడా రఘునాథ్ రెడ్డే అని ఆరోపిస్తూ, హార్బర్ పనులపై విజిలెన్స్ ఎంక్వైరీకి జగన్ సిద్ధమా అని ఎమ్మెల్సీ బీద రవిచంద్ర సవాల్ విసిరారు.
జగన్ పర్యటనలు.. గొడవలు సృష్టించేందుకే: కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి
నిన్న(బుధవారం) జగన్ నోటికొచ్చినట్లు మాట్లాడారని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి విమర్శించారు. చంద్రబాబుకు వార్నింగ్ ఇచ్చే స్థాయి జగన్‌కు ఉందా అని ప్రశ్నించారు. ఇలాంటి భాష మాట్లాడటం వల్లే వైసీపీ 11 సీట్లకు పరిమితమైందని అన్నారు. గొడవలు సృష్టించేందుకే జగన్ పర్యటనలు చేస్తున్నారని అన్నారు. నియోజకవర్గాల నుంచి బస్సులు పెట్టి సామాన్య జనాలను తరలించి మత్స్యకారులు వచ్చినట్లు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. ఎంపీలు, మంత్రులను ఉద్దేశించి ‘వాడు, వీడు’ అని సంబోధిస్తే తిరిగి తాము మాట్లాడలేమా అని కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి ప్రశ్నించారు.
మత్స్యకారులకు న్యాయం చేసంది టీడీపీనే: సత్య
మత్స్యకారులకు న్యాయం చేసింది టీడీపీనే అని మారిటైమ్ బోర్డు చైర్మన్ సత్య తెలిపారు. వేట నిషేధ సమయంలో రూ.20 వేలు ఇస్తున్నామని చెప్పారు. పరిశ్రమలు పెట్టి ఉపాధి కల్పించాలనుకునే వారిని భయపెట్టేలా జగన్ మాటలు ఉన్నాయని విమర్శించారు. కమీషన్ల కోసమే జగన్ పరిశ్రమలకు శంకుస్థాపనలు చేశారని ఆరోపించారు. ప్రధాని సూచనల మేరకే సాగర్ డిఫెన్స్ సంస్థను జువ్వలదిన్నెలో ఏర్పాటు చేశామని స్పష్టం చేశారు. మత్స్యకారుల మధ్య గొడవలు సృష్టించేందుకే జగన్ విమర్శలు చేస్తున్నారని సత్య వ్యాఖ్యానించారు.
ఇవి కూడా చదవండి...
జగన్‌కు ఉన్న ప్రేమ ఒక్కటే గొడ్డలి పార్టీ.. గొడ్డలి గుర్తు: మంత్రి కొల్లు రవీంద్ర
టీడీపీలో ఎన్నో సంస్కరణలకు లోకేశ్ శ్రీకారం: మంత్రి గొట్టిపాటి రవికుమార్
Read Latest AP News And Telugu News