సోషల్ మీడియా నియంత్రణపై మంత్రి నారా లోకేశ్ కీలక నిర్ణయాలు!
ABN , Publish Date - Apr 09 , 2026 | 09:30 PM
నేటి సమాజం.. సర్వం సోషల్ మీడియా మయం. మారుతున్న కాలంలో సోషల్ మీడియా వినియోగం విపరీతంగా పెరిగిపోతోంది. దాని దుష్ప్రభావాల నుంచి భావి తరాలను కాపాడుకోవాలని మంత్రి నారా లోకేశ్ పిలుపునిచ్చారు.
అమరావతి, ఏప్రిల్ 9: నేటి సమాజం.. సర్వం సోషల్ మీడియా మయం. మారుతున్న కాలంలో సోషల్ మీడియా వినియోగం విపరీతంగా పెరిగిపోతోంది. దాని దుష్ప్రభావాల నుంచి భావి తరాలను కాపాడుకోవాలని మంత్రి నారా లోకేశ్ పిలుపునిచ్చారు. ఈ బాధ్యత ప్రభుత్వంపైనా ఉందని నారా లోకేశ్ స్పష్టం చేశారు. పిల్లల డిజిటల్ భద్రత, మహిళల గౌరవంపై మంత్రులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి లోకేశ్ మాట్లాడుతూ.. ‘పిల్లల మానసిక వికాసం దెబ్బతినకుండా ఉండేందుకు సోషల్ మీడియాలో విప్లవాత్మక మార్పులు తీసుకురావాలి. 13 నుంచి 16 ఏళ్ల వయసు పిల్లలకు కేవలం వారి ఎదుగుదలకు, విద్యకు ఉపయోగపడే కంటెంట్ మాత్రమే అందుబాటులో ఉండేలా విధివిధానాలను రూపొందించాలి. సోషల్ మీడియాను వేదికగా చేసుకొని విద్వేషాలను చిమ్మేవారిని ఉపేక్షించేది లేదు. మహిళల పట్ల అవమానకరంగా ప్రవర్తించినా, అశ్లీల లేదా విద్వేషపూరిత వ్యాఖ్యలు చేసినా కఠినమైన చర్యలు తీసుకుంటాం. ఇతర రాష్ట్రాలు, అభివృద్ధి చెందిన దేశాల్లో అమలవుతున్న డిజిటల్ సేఫ్టీ చట్టాలను అధ్యయనం చేసి, ఆంధ్రప్రదేశ్‌లో అత్యుత్తమ విధానాన్ని అమలు చేయాలి. పిల్లలను సోషల్ మీడియా దుష్ప్రభావాలకు దూరం చేయడం ఇప్పుడు అనివార్యం. వారి సృజనాత్మకతను కాపాడుతూనే, సురక్షితమైన డిజిటల్ వాతావరణాన్ని అందించడమే మా ప్రభుత్వ లక్ష్యం’ అని అన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
అచ్చెన్నాయుడి వ్యాఖ్యలను ఖండించిన ఎమ్మెల్సీ బొత్స
ఐఏఎస్‌లను బెదిరించి చీకటి జీవోలు తెచ్చారు.. కేసీఆర్‌పై ఎంపీ చామల ధ్వజం
Read Latest AP News And Telugu News