రష్యాలో మంత్రి లోకేష్ పెట్టుబడుల వేట.. ఏపీకి భారీ ప్రాజెక్టులు!
ABN , Publish Date - Jun 04 , 2026 | 06:12 PM
రష్యాలో ప్రతిష్ఠాత్మకంగా జరుగుతున్న ఎస్పీఐఈఎఫ్ బిజినెస్ ఫోరం ససస్సులో ఆంధ్రప్రదేశ్ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా రష్యా పారిశ్రామిక దిగ్గజాలతో మంత్రి లోకేష్ చర్చలు జరిపారు.
అమరావతి, జూన్ 04: రష్యాలో ప్రతిష్ఠాత్మకంగా జరుగుతున్న ఎస్పీఐఈఎఫ్ (SPIEF) బిజినెస్ ఫోరం ససస్సులో ఆంధ్రప్రదేశ్ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు. భారత్, రష్యాల మధ్య ఉన్న సుదీర్ఘ సాంకేతిక, ఆర్థిక అనుబంధాన్ని గుర్తుచేస్తూ, 2030 నాటికి $100 బిలియన్ల ద్వైపాక్షిక వాణిజ్య లక్ష్యాన్ని చేరుకోవడంలో ఏపీ కీలక పాత్ర పోషిస్తుందని మంత్రి లోకేష్ స్పష్టం చేశారు. 'స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్' విధానంతో ఆంధ్రప్రదేశ్‌ను $2.5 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా మార్చడమే తమ ధ్యేయమని ప్రకటిస్తూ.. అంతర్జాతీయ పారిశ్రామికవేత్తలను కేవలం పెట్టుబడిదారులుగా కాకుండా రాష్ట్ర అభివృద్ధిలో సమాన భాగస్వాములుగా ఆహ్వానించారు. ఈ సదస్సులో భాగంగా రష్యాకు చెందిన ప్రముఖ ఉక్కు దిగ్గజం 'నోవోస్టల్–ఎం' సంస్థ చైర్మన్ ఇవాన్ డెమ్చెంకోతో మంత్రి లోకేష్ ప్రత్యేకంగా భేటీ అయ్యారు.
భారతదేశంలో అత్యాధునిక ఈఏఎఫ్ (EAF) గ్రీన్ స్టీల్ ప్లాంట్ నిర్మాణాన్ని చేపట్టాలని, అదేవిధంగా ఏపీలోని ప్రతిష్ఠాత్మక పారిశ్రామిక హబ్ 'శ్రీసిటీ'లో రైల్వే ట్రాక్ రోలింగ్ మిల్లును ఏర్పాటు చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. అనంతరం గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్ సంస్థ 'సిస్టమా' ప్రెసిడెంట్ తాగిర్ సిట్దేకోవ్‌తో జరిగిన సమావేశంలో పాల్గొన్న మంత్రి లోకేష్.. రాష్ట్రంలో సరికొత్త రవాణా, సాంకేతిక ప్రాజెక్టులపై చర్చించారు. ఆంధ్రప్రదేశ్‌లోని అంతర్గత జలరవాణా మార్గాలలో పర్యావరణ అనుకూల 'ఎలక్ట్రిక్ రివర్ మెట్రో' పైలట్ ప్రాజెక్టులను ప్రారంభించాలని కోరారు. దీంతో పాటు భవిష్యత్ సాంకేతికతలకు కేంద్రంగా నిలుస్తున్న ఏపీ 'క్వాంటమ్ వ్యాలీ ఫ్రేమ్ వర్క్' ప్రాజెక్టులో సిస్టమా సంస్థను భాగస్వామి కావాల్సిందిగా మంత్రి నారా లోకేష్ ఆహ్వానించారు.
ఇవి కూడా చదవండి...
రెండేళ్లలో ఏం చేశామో ప్రజలకు వివరించండి.. మంత్రులకు సీఎం చంద్రబాబు ఆదేశం
బలమైన భారత్ కోసం యువత ఎదురుచూపు: పవన్ కల్యాణ్
Read Latest AP News And Telugu News